ఇంతకుముందు ఈపిఎఫ్ ఖాతాదారులకు ఇ-నామినేషన్ డిసంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా ఈ తేదీని పొడిగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో, ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా పిఎఫ్ చందాదారులు ఇ-నామినేషన్ చేయవచ్చని ఈపిఎఫ్‌ఓ ఒక ట్వీట్‌లో తెలియజేసింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగే తేదీకి సంబంధించి ఎటువంటి నిర్ణీత తేదీని వెల్లడించలేదు.