ఈ ఒక్క ట్రైయిన్ టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైలులో దేశం అంతటా ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా?

First Published | Dec 6, 2023, 3:30 PM IST

భారతీయ రైల్వేల  ఒక ప్రత్యేకమైన సర్వీస్ ఏంటంటే  ఒకే రైలు టిక్కెట్‌తో 56 రోజుల పాటు ప్రయాణించడానికి మీకు ఉపయోగపడుతుంది. అసలు ఈ టికెట్ ఏంటి, ధర ఎంత, ఎలా బుకింగ్ చేసుకోవాలో విధానాన్ని తెలుసుకోండి... 
 

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. భారతీయ రైల్వే ప్రయాణికులకు ఎన్నో  సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే, రైల్వే అందించే అనేక సేవల గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియదు. అదేవిధంగా, చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన సేవలలో సర్క్యులర్ జర్నీ టికెట్ ఒకటి.
 

భారతీయ రైల్వే వెబ్‌సైట్ నుండి పొందిన సమాచారం ప్రకారం, రైల్వే సర్క్యులర్ జర్నీ టికెట్ అనే ప్రత్యేక టిక్కెట్‌ను జారీ చేస్తుంది. ఈ టికెట్‌తో రైలు ప్రయాణికులు 8 వేర్వేరు స్టేషన్‌ల నుండి ఒక టికెట్‌లో 56 రోజుల పాటు ప్రయాణించవచ్చు. ఈ కాలంలో మీరు అనేక రైళ్లను ఎక్కవచ్చు. సాధారణంగా యాత్రికులు లేదా పర్యాటకులు ఈ రైల్వే టికెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటుంటారు.
 


మీరు వేర్వేరు స్టేషన్లలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే చాల  ఖర్చవుతుంది. కానీ సర్క్యులర్ జర్నీ టిక్కెట్లు 'టెలిస్కోప్ ఛార్జీల' ప్రయోజనాన్ని అందిస్తాయి, ఇవి సాధారణ పాయింట్-టు-పాయింట్ ఛార్జీల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఏ క్లాసులోనైన ప్రయాణించడానికి సర్క్యులర్ జర్నీ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
 

మీరు నార్త్ రైల్వేలో న్యూ ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు ఒక సర్క్యులర్ జర్నీ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారని అనుకుందాం, అప్పుడు మీ ప్రయాణం న్యూఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. మళ్ళీ  న్యూఢిల్లీలోనే ముగుస్తుంది. మధుర నుంచి ముంబై సెంట్రల్, మర్మగోవా(Mormugao), బెంగళూరు సిటీ, మైసూర్, బెంగళూరు సిటీ, Ooty, తిరువనంతపురం సెంట్రల్ మీదుగా కన్యాకుమారి చేరుకుని తిరిగి అదే మార్గంలో న్యూఢిల్లీకి చేరుకోవాలి.
 

సర్క్యులర్ జర్నీ టిక్కెట్  చెల్లుబాటు వ్యవధి 56 రోజులు. రౌండ్ ట్రిప్ టిక్కెట్లను నేరుగా టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేయలేరు. ఇందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. మీరు మీ ప్రయాణ మార్గం గురించి సమాచారాన్ని కొన్ని ప్రధాన స్టేషన్‌లలో     లేదా స్టేషన్ మేనేజర్‌లతో షేర్ చేసుకోవాలి.
 

Latest Videos

click me!