భారతదేశంలోని అన్ని బ్యాంకుల ప్రాతినిధ్య సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ IBA వాస్తవానికి ప్రతిపాదనను సమర్పించిందని చెప్పారు.
2015 నుండి, భారతదేశంలోని బ్యాంకులు ప్రతి నెల రెండవ, చివరి నాల్గవ శనివారం ప్రభుత్వ సెలవు దినంగా మూసివేయబడుతున్నాయి. వారంలో ఐదు రోజుల పనిదినాల డిమాండ్ బ్యాంకుల్లో, ప్రత్యేకించి ప్రజలలో చాలా కాలంగా ఉంది.
IBA సభ్యత్వం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ అండ్ ప్రైవేట్ బ్యాంకులు, భారతదేశంలో ఆఫీసులు ఉన్న విదేశీ బ్యాంకులు, అలాగే అన్ని సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇంకా అఖిల భారత ఆర్థిక సంస్థలతో ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో 1.5 మిలియన్లకు పైగా వర్క్ ఫోర్స్ ఉన్నట్లు అంచనా వేయబడింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం డిమాండ్ ఆమోదించబడిందా లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా ఆమోదించబడవచ్చా అనేది సూచించలేదు. సోర్సెస్ ప్రకారం ఒకవేళ ఆమోదించబడినట్లయితే, ఈ చర్య ఐదు రోజుల వర్కింగ్ వీక్ లో పొడిగించిన గంటలతో రావచ్చు.