ఒమిక్రాన్ భయాలు: ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన టిక్కెట్లపై ఫ్రీ ఆఫర్.. వివరాలు ఇక్కడ..

First Published Jan 10, 2022, 1:44 PM IST

కోవిడ్-19(COVID-19) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(omicron)  కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఎయిర్ ఇండియా(air india), ఇండిగో ఎయిర్‌లైన్స్ (indigo airlines)దేశీయ టిక్కెట్‌లపై మార్చి 31 వరకు  ప్రయాణ  తేదీలను ఉచితంగ మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

 ఒమిక్రాన్  వ్యాప్తి భయంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ లాక్‌డౌన్‌ విధిస్తూండటంతో ఈ చర్య వచ్చింది. అలాగే చాలా మంది వ్యక్తులు వారి ప్రయాణ ప్రణాళికలను మార్చుకుంటున్నారు ఇంకా వారి ప్రయాణ తేదీలను వాయిదా వేసుకుంటున్నారు. 

ఎయిర్ ఇండియా ఒక ట్వీట్‌లో “కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా తాజాగా అనిశ్చితుల దృష్ట్యా ఎయిర్ ఇండియా అన్ని దేశీయ టిక్కెట్‌లపై ఒక ఉచిత  తేదీ మార్పు లేదా విమాన నంబర్ లేదా సెక్టార్‌లో  మార్పు చేసుకుంనేదుకు అవకాశం అందిస్తోంది."  అంటూ పోస్ట్ చేసింది.

మరోవైపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం షెడ్యూల్డ్ చేసిన విమాన కార్యకలాపాల్లో దాదాపు 20 శాతం సర్వీసులని ఉపసంహరించుకోవచ్చని అంచనా వేసింది. "కస్టమర్ అవసరాలకు ప్రతిస్పందనగా ఇండిగో ప్రయాణ తేదీల మార్పు కోసం చార్జీలను మాఫీ చేస్తోంది. అలాగే జనవరి 31 వరకు చేసుకున్నా కొత్త, ఇప్పటికే ఉన్న ప్రయాణ తేదీల బుకింగ్‌లను 31 మార్చి 2022 వరకు  ఉచిత తేదీల మార్పు ఆప్షన్  అందిస్తోంది" అని ఇండిగో ప్రకటనలో పేర్కొంది.

"విమానాల రద్దు కనీసం 72 గంటల ముందుగానే చేయబడుతుంది అలాగే కస్టమర్‌లను అందుబాటులో ఉన్న తదుపరి విమానానికి తరలించబడతారు ఇంకా మా వెబ్‌సైట్‌లోని ప్లాన్ బిని ఉపయోగించి వారి ప్రయాణాన్ని కూడా మార్చుకోగవచ్చు" అని అధికారిక ప్రకటన తెలిపింది. 

కోవిడ్-19 కేసుల పెరుగుదల మధ్య దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాలలోని ప్రయాణికులందరికి ఏడు రోజుల తప్పనిసరి హోమ్ క్వారంటైన్‌ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. " అంతర్జాతీయంగా దేశానికి వచ్చే వారందరూ జనవరి 11 నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏడు రోజుల తప్పనిసరి హోమ్ క్వారంటైన్‌ను పాటించవలసి ఉంటుంది" అని ఒక ఉత్తర్వులో పేర్కొంది.

click me!