హోమ్ లోన్ టిప్స్: పదవీ విరమణ తర్వాత కూడా గృహ రుణం ఈజీగా లభిస్తుంది, ఈ విషయాలను గుర్తుంచుకోండి

Ashok Kumar   | Asianet News
Published : Jan 08, 2022, 04:44 PM IST

ప్రతి ఒక్కరూ  స్వంత ఇల్లు ఉండాలని కోరుకుంటుంటారు, చాలా మంది ప్రజలు ఇల్లు కొనడానికి హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు  ఉద్యోగ సమయంలో ఇల్లు కొనుగోలు చేయడం కష్టం కాబట్టి పదవీ విరమణ తర్వాత సొంత ఇల్లు నిర్మించాలని కోరుకుంటారు. మీరు కూడా పదవీ విరమణ చేసి హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే అసాధ్యం కాకపోవచ్చు, కానీ  కొంచెం కష్టమే. 

PREV
14
హోమ్ లోన్ టిప్స్: పదవీ విరమణ తర్వాత కూడా గృహ రుణం ఈజీగా లభిస్తుంది, ఈ విషయాలను గుర్తుంచుకోండి

పదవీ విరమణ తర్వాత హోమ్ లోన్ తీసుకోవడం అనేది ఒక వ్యక్తికి సమస్యాత్మకంగా ఉంటుంది, ఎందుకంటే రిటైర్డ్ వ్యక్తి హోమ్ లోన్ కోసం కొన్ని షరతులను పాటించాల్సి ఉంటుంది. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.   మీరు ఈ విషయాలను అనుసరిస్తే పదవీ విరమణ తర్వాత హోమ్ లోన్ పొందడం సులభం అవుతుంది ఎలాగో తెలుసుకుందాం... 
 

24

హోమ్ లోన్ తీసుకునే ముందు అర్హతను తనిఖీ చేయండి 
హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు వివిధ బ్యాంకుల హోమ్ లోన్ అర్హతను చెక్ చేయండి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అన్ని బ్యాంకుల అర్హతలు భిన్నంగా ఉంటాయి. అలాగే, దరఖాస్తు చేయడానికి ముందు మీ వయస్సు దరఖాస్తు తేదీ నుండి 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే దరఖాస్తుదారుడు రుణ చెల్లింపు కోసం 75 సంవత్సరాలు ఇవ్వబడుతుంది. ఈ సందర్భంలో రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.
 

34

కనీసం అప్పు తీసుకోండి
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మీ సహకారాన్ని ఎక్కువగా ఉంచండి. ఇది మీ ఈ‌ఎం‌ఐ వాల్యు ఇంకా బ్యాంక్ రిస్క్ ఫ్యాక్టర్‌ను తగ్గిస్తుంది. ఈ రెండు కారణాల వల్ల మీ రుణం పొందే అవకాశాలు పెరుగుతాయి. 

స్థిరమైన పెన్షన్
మీరు స్థిరమైన పెన్షన్‌తో పదవీ విరమణ పొందిన వ్యక్తి అయితే రుణం పొందే అవకాశం ఉంది. 
 

44

ప్రభుత్వ రంగ బ్యాంకును ఆశ్రయించండి
పదవీ విరమణ తర్వాత మీరు పెన్షన్‌పై ఆధారపడి ఉంటే మీరు ప్రైవేట్ బ్యాంకులకు బదులుగా ప్రభుత్వ బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ బ్యాంకుల్లో పింఛనుదారులకు ప్రత్యేక రుణాలు కూడా ఇస్తారు. అన్నింటికంటే ఉత్తమమైనది, ఇక్కడ మీరు పర్సనల్ లోన్ కంటే కొంచెం తక్కువ వడ్డీ రేట్లు పొందుతారు. 

click me!

Recommended Stories