Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండానే మీ ఖాళీ సమయంలో 2 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ. 50 వేలు సంపాదించవచ్చు

First Published | May 30, 2023, 6:02 PM IST

మహిళలు మీరు ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడే మీరు తెలుసుకోండి.  ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఇంటి వద్ద ఉండే మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని చక్కటి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆ బిజినెస్ ఐడియా ఏంటో ఎలా చేయాలో ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మహిళలు మీరు ఇంటి వద్ద చేయగలిగే బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారా.. అయితే ఈ బిజినెస్ ఐడియా మీకు ఉపయోగపడవచ్చు.  ఇది చాలా సింపుల్ బిజినెస్ అని చెప్పాలి కానీ ప్రస్తుతం మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఈ బిజినెస్ కు డిమాండ్ లభిస్తుంది. కనుక మీరు నెమ్మదిగా తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయాన్ని భవిష్యత్తులో పొందే అవకాశం ఉంది
 


ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఫంక్షన్లలో ఎక్కువగా ఆభరణాలను ధరించడానికి జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా డిజైన్ చేసినటువంటి గాజులను వేసుకునేందుకు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. 
 



మీరు గ్లాసు లేదా మెటల్  పదార్థంతో చేసినటువంటి, గాజులను కొనుగోలు చేసి చక్కటి డిజైనింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముందుగా ప్లైన్ గాజులను కొనుగోలు చేసి వాటిపై చక్కటి డిజైనింగ్ చేయాల్సి ఉంటుంది.  అనంతరం ఈ గాజులను మీరు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు.  ఇందుకోసం మీరు ఇంటి వద్ద రోజుకు రెండు మూడు గంటలు కేటాయిస్తే సరిపోతుంది మీ ఖాళీ సమయంలోనే మీరు ఈ పని చేయవచ్చు.
 

ఇక మీరు గాజులను ఆకర్షణీయంగా డిజైనింగ్ చేయాలనుకుంటే, చక్కటి యూట్యూబ్ ని కూడా ఆసరా చేసుకోవచ్చు.  యూట్యూబ్ ద్వారా మీరు గాజుల డిజైనింగ్ కు సంబంధించిన వీడియోలను చూసి చక్కటి డిజైన్లను రూపొందించవచ్చు. 

ఇక ఈ డిజైనింగ్ గాజులను ఎక్కడ విక్రయించాలా అని మీరు సందేహం మీకు కలిగే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా మీరు ఈ గాజులను హాయిగా విక్రయించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఆన్ లైన్ లో అనేక ప్లాట్ ఫాంలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్,  మీషో వంటి యాప్స్ లలో మీరు డిజైనింగ్ గాజులను  విక్రయించవచ్చు.

అలాగే కొన్ని బోటిక్ డిజైనర్లతో కూడా ఒప్పందం చేసుకొని వారి డ్రెస్ డిజైన్లకు తగ్గట్టుగా మ్యాచింగ్ గాజులను మీరు డిజైన్ చేసి ఇవ్వవచ్చు. అలాగే కొన్ని షాపుల్లో కూడా మీ డిజైన్లను డిస్ ప్లే లో పెట్టడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే ఆన్ లైన్ ప్లాట్ ఫాం అయినా ఫేస్ బుక్, ఇంస్టాగ్రాం, ట్విట్టర్, యూట్యూబ్ ఉపయోగించుకొని మీరు కస్టమర్లతో నేరుగా అనుబంధం ఏర్పరచుకునే అవకాశం ఉంది. 

Latest Videos

click me!