New Maruti Suzuki Eeco: జస్ట్ రూ.70 వేలు ఉంటే చాలు ఈ మారుతి కారును మీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు..వివరాలు మీకోసం

First Published | Apr 28, 2023, 4:12 PM IST

మీ వద్ద రూ.70,000 ఉన్నాయా అయితే ఓ మారుతీ కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది ఎలాగో దానికి సంబంధించిన ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

CNG కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, కార్ల తయారీదారులు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో  మాత్రమే కాదు సెడాన్, SUV, MPV విభాగాలలో CNG వర్షన్ కార్లను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా MPV సెగ్మెంట్‌లో ఉన్న మారుతి సుజుకి Eeco CNG కార్లు మంచి సేల్స్ అందుకుంటున్నాయి. అంతే కాదు మల్టీ పర్పస్ వెహికిల్ విభాగంలో ఈ కారు చాలా తక్కవు ధరకు లభిస్తోంది. మీరు మారుతి సుజుకి ఈకో సిఎన్‌జిని కొనుగోలు చేయాలనుకుంటే, దానికి సంబంధించిన పూర్తి వివరాలు, సులభమైన డౌన్ పేమెంట్, నెలవారీ ఇఎంఐ ప్లాన్‌ గురించి తెలుసుకుందాం. 
 

ధర ఎంత..?
మారుతి సుజుకి Eeco CNG ధర రూ. 6,50,700 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై రూ. 7,32,951 ఆన్-రోడ్ వరకు ఉంది. ఎకో సిఎన్‌జిని కొనుగోలు చేయడానికి మీ వద్ద 7 లక్షల రూపాయల బడ్జెట్ లేకపోతే, కింద పేర్కొన్న ఫైనాన్స్ ప్లాన్ ద్వారా కేవలం రూ.70 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి కూడా కారును కొనుగోలు చేయవచ్చు.


ఆన్‌లైన్ ఫైనాన్స్, డౌన్ పేమెంట్ ప్లాన్ కాలిక్యులేటర్ ప్రకారం, మీ వద్ద రూ. 70,000 ఉంటే, మీరు దాని నెలవారీ EMI చెల్లించగలిగితే, దీని ఆధారంగా బ్యాంక్ రూ. 6,62,951 రుణాన్ని పొందే వీలుంది. లోన్ ఆమోదించిన తర్వాత, మీరు మారుతి ఈకో CNG కోసం రూ. 70,000 డౌన్ పేమెంట్ చేయాలి. ఆపై బ్యాంక్ నిర్ణయించిన విధంగా 5 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 14,021 నెలవారీ EMI చెల్లించాలి .

మారుతి ఈకో సిఎన్‌జికి సంబంధించిన  ఇంజన్, మైలేజ్ , ఫీచర్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం.  మారుతి ఈకో సిఎన్‌జిలో, కంపెనీ 1197 సిసి ఇంజిన్‌ను అందించింది, దానితో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో లభిస్తోంది. ఈ ఇంజన్ 70.67 బిహెచ్‌పి పవర్, 95 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీకి సంబంధించి, ఈకో ఒక కిలో సిఎన్‌జిపై 26.78 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మైలేజీని ARAI ధృవీకరించింది.

మారుతి ఈకో CNG ఫీచర్స్ ఇవే..
మారుతి ఈకోలో ఉన్న ఫీచర్ల గురించి చెప్పాలంటే, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ కండీషనర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ అలర్ట్, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఈ కారులో మనకు కనిపిస్తాయి. 

Latest Videos

click me!