ఐస్ క్యూబ్ విక్రయాల కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న వ్యాపారవేత్తలు కొనుగోలు కోసం మీ ఫ్యాక్టరీకి వస్తారు. మీరు ఫ్యాక్టరీ సిద్ధంగా ఉన్న ఐస్ క్యూబ్‌ని ఐస్‌క్రీమ్ షాప్, హోటల్, రెస్టారెంట్, ఫ్లవర్ షాప్, మాంసం, చేపల దుకాణాలకు అమ్మవచ్చు. సొంతంగా ఫ్యాక్టరీ ప్రారంభించి చేతులు దులుపుకుంటే అమ్మకాలు జరగవు. మీ ఫ్యాక్టరీని ప్రచారం చేయడం ముఖ్యం. అందుకు మీ సమీపంలో పోస్టర్లను బ్యానర్లను తగిలించి ప్రచారం చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది.