Gig workers: గిగ్ వర్కర్స్ కోసం కొత్త చట్టం, అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు?

Published : Nov 23, 2025, 02:24 PM IST

Gig workers: గిగ్ వర్కర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అసలు గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? వారికి కొత్త చట్టం ఎందుకు వచ్చింది? ఆ చట్టం ఏం చెబుతోంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
గిగ్ వర్కర్స్ అంటే ఎవరు?

భారతదేశంలో గిగ్ వర్కర్స్ సంఖ్య అధికంగా ఉంది. కానీ ఎంతో మందికి గిగ్ వర్కర్స్ అంటే ఎవరో తెలియదు. మనం ప్రతి రోజు చూసే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు, అర్బన్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లు వీరంతా గిగ్ వర్కర్స్ కిందకే వస్తారు. వీరు ఎవరి కంపెనీలోనూ శాశ్వత ఉద్యోగులు కాదు. ఏదైనా పని ఉంటే చేసి దానికి తగ్గ డబ్బులు తీసుకుంటారు. కానీ వీరికి ఆదాయం స్థిరంగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో గిగ్ వర్కర్స్‌ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వంచే వీరికోసం ప్రత్యేక చట్టాలను తెచ్చింది.

25
కొత్త లేబర్ కోడ్

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ గిగ్ వర్కర్స్‌లో ఆశలు పెంచుతోంది. ఎందుకంటే ఈ కొత్త కోడ్స్ ద్వారా గిగ్ వర్కర్స్‌ని అధికారికంగా గుర్తిస్తుంది. వారికి కూడా సామాజిక భద్రత లభిస్తుంది. గిగ్ వర్కర్ అనేది ఒకే కంపెనీలో పూర్తి స్థాయిలో పనిచేసే వ్యక్తి కాదు. యాప్‌ ద్వారా పని వస్తే చేస్తారు. షిఫ్ట్‌లు లేదా స్థిరమైన టైమింగ్స్ ఉండవు. వీరికి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

35
గిగ్ వర్కర్స్ వచ్చే లాభాలు

ప్రభుత్వం గిగ్ వర్కర్స్‌కి ఆరోగ్య బీమా, ప్రమాద బీమాను అందిస్తుంది. వృద్ధాప్యంలో పెన్షన్ భద్రత, మెటర్నిటీ ప్రయోజనాలు, లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.ఇంతకాలం ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగులకు మాత్రమే వర్తించేవి. ఇప్పుడు గిగ్ వర్కర్స్‌కు కూడా అందుబాటులోకి రావడం ఎంతో మంచిది. వీరికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫండ్‌లోకి Swiggy, Zomato, Uber లాంటి కంపెనీలు వారి టర్నోవర్‌లో ఒక శాతం నుంచి రెండు శాతం వరకు డబ్బు చెల్లించాలి.

45
గిగ్ వర్కర్స్ కి UAN నెంబర్

ఇది గిగ్ వర్కర్స్ కి ఇచ్చే ముఖ్యమైన సహాయం. ప్రతి గిగ్ వర్కర్‌కి ప్రత్యేకంగా UAN ఇస్తారు. ఇది వారి అన్ని సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను ఒకే చోట ఉంచుతుంది. ఒక నగరం నుంచి మరొక నగరానికి, లేదా ఒక యాప్ నుంచి మరొక యాప్‌కి మారినా ఈ ప్రయోజనాలు అలాగే కొనసాగుతాయి. ఉదాహరణకు ఎవరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లినా వారి ప్రయోజనాలు అక్కడ కూడా పనిచేస్తాయి.

55
అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు ఇకపై

ఇక గిగ్ వర్కర్లను నోటి మాటతో ఉద్యోగాల్లో చేర్చుకోరు. ప్రతి వర్కర్‌కూ అపాయిట్మంట్ లెటర్ ఇస్తారు.దీనిలో పని విధానం, జీతం వివరాలు, చేయాల్సన పనుల గురంచి స్పష్టంగా రాసి ఉంటుంది. దీని వల్ల వర్కర్లు న్యాయపరంగా రక్షణ పొందుతారు. గిగ్ వర్కర్లకు ప్రమాదాలు జరిగినప్పుడు కంపెనీలపై బాధ్యత పెరుగుతుంది. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు వంటి వర్కర్స్‌కి భద్రతా ఏర్పడుతుంది. ఆదాయం స్థిరంగా లేకపోయినా ఆరోగ్య బీమా, భవిష్యత్ భద్రత ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories