Multibagger Stock: ఒక లక్ష రూపాయల పెట్టుబడిని, జస్ట్ 2 సంవత్సరాల్లో రూ. 50 లక్షలు చేసిన స్టాక్ ఇదే..

Published : May 05, 2022, 01:23 PM IST

Multibagger Stock: స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకుంటే ఒక్కో  సారి మీ భాగ్య రేఖను మార్చేస్తుంది. పెన్నీ స్టాక్స్ అని తీసిపారేసిన షేర్లే, లాభాలను అందిస్తుంటాయి. తాజాగా టాటా గ్రూపునకు చెందిన ఓ పెన్నీ స్టాక్ గడిచిన రెండేళ్లలో ఏకంగా రూ.1 లక్ష పెట్టుబడిని రూ. 50 లక్షలుగా మార్చేసింది. ఆ కథేంటో చూద్దాం.

PREV
16
Multibagger Stock: ఒక లక్ష రూపాయల పెట్టుబడిని, జస్ట్ 2 సంవత్సరాల్లో రూ. 50 లక్షలు చేసిన స్టాక్ ఇదే..

స్టాక్ మార్కెట్ ఏ నిపుణుడితో మాట్లాడినా పెన్నీ స్టాక్స్ కొనుగోలు చేయడం రిస్క్ అని చెప్పేస్తుంటారు. కానీ ఆ రిస్క్ ను కాస్త తట్టుకొని మార్కెట్ ను స్టడీ చేస్తే పెన్నీ స్టాక్స్ కూడా సిరులు కురిపిస్తుంటాయి. రిస్క్ ఎక్కువగా ఉన్న చోట, ప్రతిఫలం కూడా బాగుంటుందని అందరికీ తెలుసు. మీరు మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, రిస్క్ తీసుకోవడం పెద్ద  విషయం ఏమి కాదు. చాలా మంది పెద్ద ఇన్వెస్టర్లు సంస్థ వ్యాపార నమూనాను అర్థం చేసుకొని అందులో డబ్బును ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ పొందుతారు. 
 

26

పెన్నీ స్టాక్స్‌ బూమ్ గురించి మీరు ప్రతిరోజూ వార్తలను చదవడానికి ఇదే కారణం. బిజినెస్ మోడల్ బాగుండాలి, కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండాలి అనే ఫార్ములా పాటిస్తే చాలు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ను ఇట్టే పట్టేయొచ్చు. ఈ రోజు మనం అలాంటి ఓ స్టాక్ గురించి మాట్లాడబోతున్నాము, ఇది సుమారు 2 సంవత్సరాల కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడిని 50 రెట్లు పెంచింది. అంటే 1 లక్ష 50 లక్షలు అయింది. ఆ కంపెనీ పేరు టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ లేదా TTML. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత 2 సంవత్సరాలలో రూ.2.50 నుండి రూ.126 స్థాయికి పెరిగింది. ఈ సమయంలో, సుమారు 4900 శాతం పెరుగుదల నమోదు చేసింది. 

36
TTML చరిత్ర

ఈ టాటా గ్రూప్ స్టాక్ 2022 ప్రారంభం నుండి కన్సాలిడేట్ అవుతోంది. ఈ టెలికాం స్టాక్ ఒక్కో షేరుకు దాదాపు రూ.195 నుండి రూ.126కి పడిపోయింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి  ఈ మధ్య కాలంలో కాలంలో దాదాపు 35 శాతం పతనం. 7 ఏప్రిల్ 2022న, ఇది గరిష్టంగా రూ. 210.40కి చేరుకుంది. అప్పటి నుండి స్థిరమైన క్షీణత నమోదైంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.130.40 వద్ద ట్రేడవుతోంది.

46

అయితే ఈ స్టాక్  నిన్నటి ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోకుండా, గత 6 నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.67 నుండి రూ.126కి పెరిగింది, ఈ కాలంలో దాదాపు 80 శాతం లాభాన్ని ఇచ్చింది. అదేవిధంగా, గత ఒక సంవత్సరంలో, TTML షేర్ ధర రూ.12.75 నుండి రూ.126కి పెరిగింది. అయితే ఈ స్టాక్  నిన్నటి ముగింపు ధరను పరిగణనలోకి తీసుకోకుండా, గత 6 నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.67 నుండి రూ.126కి పెరిగింది, ఈ కాలంలో దాదాపు 80 శాతం లాభాన్ని ఇచ్చింది. అదేవిధంగా, గత ఒక సంవత్సరంలో, TTML షేర్ ధర రూ.12.75 నుండి రూ.126కి పెరిగింది.  అదేవిధంగా, TTML షేర్ ధర రూ. 2.50 (NSEలో 30 ఏప్రిల్ 2020న ముగింపు ధర) నుండి రూ. 126కి (మే 4, 2022న ముగింపు ధర) పెరిగింది, ఇది దాదాపు రెండేళ్ల వ్యవధిలో దాదాపు 50 రెట్లు పెరిగింది.

56
రూ. 1 లక్ష ...రూ. 50 లక్షలు అయ్యింది..

ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం TTMLలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అతని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 65,000 అయ్యేది. అయితే అదే ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు అతని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 1.80 లక్షలు అయిఉండేది. అదే విధంగా, ఒక ఇన్వెస్టర్ ఒక సంవత్సరం క్రితం టాటా గ్రూప్ షేర్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అతని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 9.50 లక్షలు అయ్యేది.

66

ఒక ఇన్వెస్టర్ రెండు సంవత్సరాల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో ఒక షేరును రూ. 2.50 చొప్పున కొనుగోలు చేయడం ద్వారా రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అప్పుడు అతని రూ. 1 లక్ష నేడు రూ. 50 లక్షలు అయ్యేది. 

Read more Photos on
click me!

Recommended Stories