MS Dhoni Investment : ఈ బిజినెస్ లో ధోని పెట్టుబడులు.. ఈ రంగంలో మీరు ఇన్వెస్ట్ చేసినా లాభాల పంట ఖాయం.!

Published : Jul 23, 2026, 02:22 PM IST

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టిన ధోని ఇప్పుడు సోలార్ ఎనర్జీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెట్టుబడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

PREV
15
స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టిన ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మంచి క్రికెటర్ మాత్రమే కాదు ఇన్వెస్టర్ కూడా. క్రికెట్లో పరుగుల వరద పారించిన ఆయన వ్యాపార రంగంలో లాభాల పంట పండిస్తున్నారు. ఇలా ఇప్పటికే అనేక స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టిన ధోనీ తాజాగా మరో భారీ ఇన్వెస్ట్మెంట్ చేశారు.

తన 'మిడాస్ డీల్స్' ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా రూఫ్‌టాప్ సోలార్ స్టార్టప్ 'సోలార్‌స్క్వేర్' కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టారు ధోని. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరించనున్నారు. అయితే ఈ స్టార్టప్ లో ధోని ఎంత పెట్టుబడి పెట్టారన్నది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

25
రూ.510 కోట్లలో ధోని వాటా కూడా..

సోలార్‌స్క్వేర్ ఇటీవల $53 మిలియన్లు (సుమారు రూ.510 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. ధోని పెట్టుబడి కూడా ఇందులో భాగమే. ఈ ఫండింగ్‌కు లైట్‌స్పీడ్ సంస్థ నాయకత్వం వహించింది. లోయర్‌కార్బన్ క్యాపిటల్, రెయిన్‌మ్యాటర్, గుడ్ క్యాపిటల్ వంటి సంస్థలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టాయి. భారత రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్‌పై ధోనికి ఉన్న నమ్మకాన్ని ఈ పెట్టుబడి చూపిస్తోందని కంపెనీ తెలిపింది.

35
కొత్త నగరాలకు విస్తరిస్తున్న సోలార్‌స్క్వేర్

ఈ సోలార్‌స్క్వేర్ సంస్థను శ్రేయా మిశ్రా, నీరజ్ జైన్, నిఖిల్ నహార్ అనే ముగ్గురు కలిసి 2015లో స్థాపించారు. మొదట్లో కమర్షియల్, ఇండస్ట్రియల్ కస్టమర్లకు సేవలు అందించినా, 2021లో ఇళ్ల కోసం రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం సోలార్ సిస్టమ్ కన్సల్టేషన్, డిజైన్, ఇన్‌స్టాలేషన్, ఫైనాన్స్, మానిటరింగ్, మెయింటెనెన్స్ వంటి పూర్తి సేవలను అందిస్తున్నారు.

సోలార్‌స్క్వేర్ తాజాగా సమీకరించిన నిధులను వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ఉపయోగించనుంది. రాబోయే రోజుల్లో 30 నుంచి 40 కొత్త నగరాల్లో సేవలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. టెక్నాలజీని మెరుగుపరచడం, కస్టమర్లకు సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు అందించడం, కస్టమర్ సర్వీస్‌ను మెరుగుపరచడం, కొత్త సిబ్బందిని నియమించుకోవడంపై దృష్టి పెట్టనుంది.

45
భవిష్యత్ రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్

ఇప్పటికే సోలార్‌స్క్వేర్ సంస్థ 29 నగరాల్లో 50,000 ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. సోలార్‌స్క్వేర్ ఇప్పటివరకు $100 మిలియన్లకు పైగా నిధులను సమీకరించింది. దాని వార్షిక ఆదాయం (ARR) సుమారు రూ.1,000 కోట్లకు చేరుకుంది. 

పెరుగుతున్న కరెంట్ బిల్లులు, ప్రభుత్వ సబ్సిడీలు, పర్యావరణహిత ఇంధనంపై ఆసక్తి కారణంగా, భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో సుమారు 7 కోట్ల ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయవచ్చని సోలార్‌స్క్వేర్ అంచనా వేస్తోంది. 2030 నాటికి భారతదేశ క్లీన్‌టెక్ మార్కెట్ $152 బిలియన్ల విలువైన అవకాశంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

55
మహేంద్ర సింగ్ ధోని పెట్టుబడి

సోలార్‌స్క్వేర్ కంపెనీలో ధోని చేసిన ఇన్వెస్ట్మెంట్ 2026లో ఆయన పెట్టిన మూడో స్టార్టప్ పెట్టుబడి. దీనికి ముందు ఆయన కుకు (Kuku), లైట్‌ఫ్యూరీ గేమ్స్ (LightFury Games) వంటి స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టారు. 

ఇటీవలి కాలంలో చాలా మంది భారత క్రికెటర్లు కూడా స్టార్టప్‌లలో భాగస్వాములవుతున్నారు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ స్టార్టప్ 'ఫిటర్' (Fittr)లో ఇన్వెస్టర్‌గా, భాగస్వామిగా ఉన్నారు. అలాగే అజింక్యా రహానే 'చూప్స్' (Chupps) అనే ఫుట్‌వేర్ బ్రాండ్‌లో, రియాన్ పరాగ్ 'ప్రాక్సీ' (Proxy) అనే డీప్‌టెక్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇది భారత క్రికెటర్లు ఇప్పుడు మైదానంలోనే కాకుండా, బయట కూడా కొత్త వ్యాపారాల్లో చురుకుగా పాల్గొంటున్నారని స్పష్టంగా చూపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories