most powerful passports:జపాన్-సింగపూర్ టాప్, ఇండియాతో సహా ప్రపంచంలోని ఈ దేశాల వారికి ఫ్రీ ఎంట్రీ..

First Published Jan 12, 2022, 5:39 PM IST

ప్రపంచంలో ఏ దేశ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైనది, ఏ దేశ పాస్‌పోర్ట్ బలహీనమైనదో  తెలుసుకోవడానికి 2022 ఇయర్ పాస్‌పోర్ట్‌ ర్యాంకింగ్ వెలువడ్డాయి. పాస్‌పోర్ట్ ఇండిపెండెన్స్ పై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index)ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. 

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశం అక్టోబర్ 2021 నుండి ఏడు స్థానాలు ఎగబాకి 83వ స్థానంలో ఉంది. భారతదేశానికి ఇప్పుడు ముందస్తు వీసా లేకుండానే 60 దేశాలకు ప్రవేశం ఉంది. 

జపాన్ అండ్ సింగపూర్
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. జపాన్ ఇంకా సింగపూర్ రెండూ మళ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి . ఈ దేశాల నుంచి పాస్‌పోర్ట్ ఉన్నవారు వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించవచ్చు. దీని తరువాత జర్మనీ అండ్ దక్షిణ కొరియా పాస్‌పోర్ట్‌లు మరోసారి రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా 190 దేశాలకు ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్ ఇంకా స్పెయిన్ కలిసి ఈ జాబితాలో మూడవ ర్యాంక్‌ను పంచుకోగా. ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 189 దేశాలకు ప్రయాణించవచ్చు. ముందస్తు వీసాలు లేకుండా 188 దేశాలకు యాక్సెస్‌త ఫ్రాన్స్ ఇంకా నెదర్లాండ్స్ ఒక స్థానం ఎగబాకి ఆస్ట్రియా ఇంకా డెన్మార్క్‌లతో  నాల్గవ స్థానంలో నిలిచాయి. 
 

యునైటెడ్ స్టేట్స్-యునైటెడ్ కింగ్ డం
ఐర్లాండ్ అండ్ పోర్చుగల్ వంటి దేశాలు ఈ స్థానంలో ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాలలోని వారు ముందస్తు వీసా లేకుండా 187 దేశాలకు ప్రయాణించవచ్చు. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యుకె ఇంకా యుఎస్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో  ఉన్నాయి. ఈ దేశాల పౌరులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా 186 దేశాలను సందర్శించవచ్చు. ఆస్ట్రేలియా, కెనడా సహా చెక్ రిపబ్లిక్, గ్రీస్ అండ్ మాల్టా ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాయి. ఈ ఐదు దేశాలకు చెందిన వారు ముందస్తు వీసా లేకుండా 185 దేశాలకు వెళ్లవచ్చు. 

ఈ దేశాలు తొమ్మిది ఇంకా పదో స్థానాల్లో 
ఈసారి ఈ జాబితాలో హంగేరీ రెండు స్థానాలు ఎగబాకగా, పోలాండ్ మూడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలకు చెందిన వ్యక్తులు ముందస్తు వీసా లేకుండా 184 దేశాల్లోకి ప్రవేశించవచ్చు. లిథువేనియా, స్లోవేకియా పాస్‌పోర్ట్‌లు తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఇంకా ఇక్కడి పౌరులు ముందస్తు వీసా లేకుండా 182 దేశాలకు ప్రయాణించే హక్కును కలిగి ఉన్నారు. శక్తివంతమైన పాస్‌పోర్ట్ దేశాల జాబితాలో ఎస్టోనియా, లాట్వియా, స్లోవేకియా పదవ ర్యాంకింగ్‌ను పంచుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు 181 దేశాలకు వీసా లేకుండా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.

click me!