ఇకపై వాట్సప్ మెసేజ్ ఎడిట్ చేసే చాన్స్, కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టనున్న మెటా

First Published Oct 16, 2022, 5:49 PM IST

మీ వాట్సాప్ గ్రూప్ లో అనుకోకుండా పొరపాటుగా ఏదైనా మెసేజ్ పెట్టారా.  అయ్యో పొరపాటు అయిపోయిందని వెంటనే డిలీట్ చేసేస్తున్నారా,  అయితే ఇప్పటి నుంచి ఆ అవసరం లేదు ఎందుకంటే వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఆప్షన్ ను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. 

ఒక్కోసారి వాట్సాప్ గ్రూపులో మనం అనుకోకుండా మెసేజ్ పెడితే,  ఆ మెసేజ్ తప్పుగా ఉంటే వెంటనే డిలీట్ చేసే ఆప్షన్ ఈ మధ్యకాలంలో వాట్సప్ ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం డిలీట్ మాత్రమే కాదు పంపించిన మెసేజ్  మెసేజ్ ను ఎడిట్ చేసే ఆప్షన్ కూడా వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. దీంతో  యూజర్స్ సౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇకపై మీరు పొరపాటున ఎవరికైనా మెసేజ్ తప్పుగా పంపిస్తే, దాన్ని ఎడిట్ చేసే అవకాశం ఉంది.
 

వాట్సాప్ మాతృ సంస్థ మెటా  ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్‌కు చేరువలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ను టెక్ ప్రపంచం ముందే ఊహించింది. ఇప్పుడు దాని స్క్రీన్‌షాట్‌తో సహా వివరాలు వెల్లడయ్యాయి. 
 

వాట్సాప్ త్వరలోనే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ఇంటర్నల్ టెస్టింగ్ జరుగుతోందని ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. దాని కొన్ని స్క్రీన్‌షాట్‌లను వాట్సాప్ బీటా ఇన్ఫో విడుదల చేసింది. 
 

మీరు పంపిన మెసేజ్ ఎడిట్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత.  మీరు గ్రూప్లో లేదా ఎవరైనా వ్యక్తికి పంపిన మెసేజ్ లో అక్షర దోషం ఉంటే? ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎడిట్ చేయవచ్చు కానీ ఈ సందేశాన్ని కొంత సమయం వరకు మాత్రమే సవరించవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఇది 15 నిమిషాలు ఉంటుంది. గతంలో వాట్సాప్ డిలీట్ మెసేజ్ సమయాన్ని పెంచినందున భవిష్యత్తులో ఈసారి మరింత పెరగవచ్చు. 
 

అయితే వాట్సాప్ మెసేజ్ ను ఎడిట్  చేసినప్పుడు,  మెసేజ్ ను చివరిసారిగా మెసేజ్ ను ఎప్పుడు ఎడిట్ చేశామో టైమ్ స్టాంపు పడుతుంది. తద్వారా మెసేజ్ ఎడిట్ అయినట్టు గ్రూపులో తెలుస్తుంది.  ఇదిలా ఉంటే వాట్సాప్ గ్రూపులో మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ తెరపైకి తెచ్చింది.  దీని ద్వారా మెసేజ్ ను గ్రూప్ నుంచి డిలీట్ చేయాలి అనుకుంటే వెంటనే చేసేయొచ్చు తద్వారా మీరు ఏదైనా పొరపాటు చేస్తే గ్రూప్ లో తెలియకుండా ఉంటుంది. 
 

ఇదిలా ఉంటే వాట్సప్ మెసెంజర్ భవిష్యత్తులో మరింత అప్డేట్ అయ్యేవిధంగా మెటా చర్యలు తీసుకుంటోంది.  మరోవైపు వాట్సప్ కు పోటీగా ఉన్న టెలిగ్రామ్ సైతం   యూజర్స్ సంఖ్య పెంచుకుంటూ దూసుకెళ్తోంది.  ఇదిలా ఉంటే వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి  ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదని,  ఇప్పటికే టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఆరోపించారు.  ఇదిలా ఉంటే వాట్స్అప్ మాత్రం తమ  తమ యాప్ అన్ని రకాల ప్రైవసీ నిబంధనలకు లోబడి పని చేస్తోంది అని అని చెబుతోంది. 
 

click me!