ఆస్టన్ మార్టిన్ V8 వాంటేజ్
అత్యధిక పనితీరు కలిగిన ఆస్టన్ మార్టిన్ V8 వాంటేజ్‌కి భారతదేశపు మొదటి యజమానిగా కూడా రామ్ చరణ్ గుర్తింపు పొందాడు. ఈ హై-స్పెక్ కారు ధర ఎంతో తెలుసా? ఈ కారు ధర దాదాపు 2 కోట్ల రూపాయలు. ఈ కారు రామ్ చరణ్ రే స్వయంగా కొనుగోలు చేసిన కారు కాదు, అత్తమామలు పెళ్లి సందర్భంగా బహుమతిగా ఇచ్చిన కారు. మీరు జేమ్స్ బాండ్ సినిమాలను ఇష్టపడే వారైతే, ఈ కారును చూసిన వెంటనే గుర్తిస్తారు. ఆస్టన్ V8 వాంటేజ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బ్రిటీష్ స్పోర్ట్స్ కార్లలో ఒకటి మరియు ఈ సూపర్ కార్ 4.8 లీటర్ V8 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 420 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.