ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినప్పటికీ మనకి ఫుడ్ ట్రాక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫుడ్ ట్రక్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే, తోపుడు బండ్ల లాంటివే కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మీ బిజినెస్ వాల్యూమ్ పెంచుకునేందుకు ఫుడ్ ట్రక్ పద్ధతి అత్యుత్తమం అని చెప్పవచ్చు. ఫుడ్ ట్రాక్ అనేది మీరు సొంతంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఫుడ్ ట్రాక్స్ లో మీరు ఎలాంటి ఆహారం సర్వ్ చేస్తున్నారు. అనేది ముఖ్యమైనది ఒకవేళ మీరు యువతను టార్గెట్ చేసినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు కార్మికులు మీ కస్టమర్లు అయినట్లయితే వారికి బ్రేక్ ఫాస్ట్ సర్వీస్ అత్యుత్తమం అవుతుంది.
ఇక ఫుడ్ ట్రక్ కోసం మీరు ఒక కమర్షియల్ ట్రక్కును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లైట్ కమర్షియల్ వెహికల్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. టాటా, మహీంద్రా, అశోక్ లేలాండ్ వంటి సంస్థలు ఈ లైట్ కమర్షియల్ వెహికల్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ధర 5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే మీరు వెహికిల్ లోన్ తీసుకొని ఈఎంఐ ప్రాతిపదికన కూడా ఈ కమర్షియల్ ట్రక్స్ ను కొనుగోలు చేసుకోవచ్చు.
ఇక ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ క్ వాహనాలు సైతం వచ్చేస్తున్నాయి. ఇవి మంచి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఫుడ్ ట్రక్స్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు ఈ వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. తద్వారా మీకు డీజిల్ ఖర్చు ఉండదు.
మీరు ట్రక్కు కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వెనుక భాగాన్ని కిచెన్ లాగా మోడిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాలు ఉంచుకోవడానికి స్థలము కేటాయించుకోవాలి. దాంతోపాటు మంచినీళ్ల కోసం చిన్న ట్యాంక్ వాహనంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.
ఇక మీరు ఏ తరహా ఫుడ్ ట్రాక్ తయారు చేస్తున్నారో, దాన్నిబట్టి డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు బ్రేక్ ఫాస్ట్ కోసం తయారు చేసుకున్నట్లయితే, ఒక దోశ పెనం పట్టేలా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసుకున్నట్లయితే, అందులో సామాన్లు ఎక్కువ పట్టేలా స్థలం ఉంచుకుంటే సరిపోతుంది.
మీరు ఎక్కడైతే వ్యాపారం చేయాలనుకున్నారో, అక్కడ ఫుడ్ ట్రక్ ను ఏర్పాటు చేసుకొని, కస్టమర్లను ఆకర్షించాల్సి ఉంటుంది. సాధారణంగా రోడ్డు పక్కన ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్న దగ్గర ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. అయితే మీరు ట్రక్కు ఏర్పాటు చేసుకునే ముందు స్థానిక మునిసిపాలిటీ నుంచి అనుమతి తీసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్ట్రీట్ వండర్స్ కోసం ప్రత్యేకంగా రుణాలను అందజేస్తుంది. కనుక మీరు బ్యాంకుకు వెళ్లి ముద్రా రుణాలను పొందితే పెట్టుబడి లభిస్తుంది.
ఈ ఫుడ్ ట్రక్స్ ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది మొదట్లో మీరు ఏ ప్రదేశంలో ఎక్కువ గిరాకీ అవుతుందో గమనించి ఆ ప్రదేశంలో వాహనం నిలిపితే మంచిది. తద్వారా మీకు చక్కగా గిట్టుబాటు అవుతుంది