స్కామర్ల పనైపోయింది.. ఈ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఒక్కటి చాలు వాళ్లను కనిపెట్టడానికి..

Published : Feb 27, 2025, 11:22 AM IST

Check Fraudulent Details: మీకు వచ్చిన కాల్, ఈ-మెయిల్, యూపీఐ ఐడీ, బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి అనుమానాస్పదంగా ఉన్నాయా.. అంటే మోసపూరితమైనవిగా అనిపిస్తున్నాయా? అవి నిజమైనవో కాదో ఈ గవర్నమెంట్ వెబ్ సైట్ లో ఈజీగా కనిపెట్టొచ్చు. ప్రాసెస్ తెలుసుకుందాం రండి. 

PREV
15
స్కామర్ల పనైపోయింది.. ఈ గవర్నమెంట్ వెబ్‌సైట్ ఒక్కటి చాలు వాళ్లను కనిపెట్టడానికి..

జనాన్ని మోసం చేయడమే స్కామర్ల పని. అందుకే తప్పుడు ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్, యూపీఐ ఐడీల ద్వారా సంప్రదించి డబ్బులు కాజేస్తుంటారు. మరి మీకు వచ్చిన కాల్ గాని, మెయిల్ గాని ఫ్రాడ్ అన్న అనుమానం కలిగిందా? అయితే ఆ వివరాలను ఈ వెబ్ సైట్ లో ఈజీగా చెక్ చేయొచ్చు. 
 

25

ప్రభుత్వాలు ఆన్ లైన్ మోసాలను అడ్డుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే స్కామర్లు మాత్రం కొత్త దారుల్లో మోసాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నాయి. ఇంత చేస్తున్నా ఆన్ లైన్ మోసాలు ఆగడం లేదు. 
 

35

ఆన్ లైన్ మోసాలు ఆగాలంటే ఒక్కటే మార్గం. ప్రజలే మోసాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ మోసాలపై ప్రజల్లో చర్చ జరగాలి. మోసాలు ఎలా చేస్తారు? వాటిని ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ మోసాపోతే ప్రభుత్వంలో ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి విషయాలపై అందరూ అవగాహన పెంచుకోవాలి. 
 

45

ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలో భాగంగా నేషనల్ సైబర్ క్రైమ్ శాఖ ప్రత్యేక సౌకర్యాన్ని తీసుకొచ్చింది. మీకు అనుమానాస్పదంగా అనిపించిన ఫోన్ నంబర్, ఈ-మెయిల్, యూపీఐ ఐడీ, సోషల్ మీడియా అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఈ గవర్నమెంట్ వెబ్ సైట్ లో ఆ డీటైల్స్ చెక్ చేయొచ్చు. దీంతో వెంటనే అవి నిజమైనవో కాదో తేలిపోతుంది. ఇది గవర్నమెంట్ వెబ్ సైట్ కాబట్టి సమాచారం కచ్చితంగా అఫీషియల్ గానే ఉంటుంది. 
 

55

దీని కోసం మీకు ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి.
సెర్చ్ లో ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ అని టైప్ చేయండి.
స్టార్టింగ్ లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు చెందిన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
అందులో హోమ్ పేజీలో ‘రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
తర్వాత ‘సస్పెక్ట్ రిపోసిటరీ’పై క్లిక్ చేయండి.
తర్వాత ‘చెక్ సస్పెక్ట్ (మొబైల్, ఈ-మెయిల్,)’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
అందులో మీకు డౌట్ గా ఉన్న డీటైల్స్ అన్నీ ఎంటర్ చేసి, సెర్చ్ క్లిక్ చేయండి.
మీరు ఇచ్చిన డీటైల్స్ మోసపూరితమైతే వెంటనే ‘ఫౌండ్(found)’అని మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. మోసపూరితమైనవి కాకపోతే ‘నాట్ ఫౌండ్(not found) అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది. 

ఈ గవర్నమెంట్ వెబ్ సైట్ చాలా అద్భుతంగా ఉంది కదా.. వెంటనే మీకు అనుమానంగా ఉన్న డీటైల్స్ ఎంటర్ చేసి చెక్ చేయండి.

click me!

Recommended Stories