Lava Blaze 5G, the cheapest 5G phone in the country!
ప్రస్తుతం మార్కెట్లో చైనా ఫోన్లు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికీ ఎంత కంట్రోల్ చేసినప్పటికీ చైనా ఫోన్ల మార్కెట్ భారీగా పెరుగుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న పెద్ద ఫోన్లు కంపెనీలు అన్నీ కూడా చైనావే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మీరు పూర్తి భారతీయ కంపెనీ తయారుచేసిన ఫోన్ కొనాలని అనుకుంటున్నారా అది కూడా ఫైవ్ జి టెక్నాలజీ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం లావా కంపెనీ కాజాగా 5g ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది దీనికి సంబంధించిన ధర ఫీచర్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్స్ మళ్లీ తన Lava Agni 2, 5G సేల్స్ ను ప్రారంభించింది. ఇంతకుముందు మే 24, మే 31 న రెండు సార్లు అమ్మకాలు జరిగాయి. రెండు అమ్మకాల సమయంలోనూ ఫోన్‌కు చాలా మంచి స్పందన లభించింది. దీని ఫలితంగా విక్రయం ప్రారంభమైన నిమిషాల్లోనే Lava Agni 2, 5G స్టాక్ పూర్తి స్థాయిలో అమ్ముడు పోయింది.
జూన్ 7, 2023న, Lava Agni 2, 5G సైతం సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. Lava Agni 2, 5G జూన్ 7 మధ్యాహ్నం 12 గంటల నుండి అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది. Lava Agni 2, 5G ధర విషయానికి వస్తే ఈ ఫోన్ 8GB RAM, 256GB స్టోరేజ్ రూ.21,999కి ప్రవేశపెట్టింది.
Lava Agni 2, 5G స్పెసిఫికేషన్స్
Lava Agni 2 5G భారతదేశపు మొట్టమొదటి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఫోన్. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1.07 బిలియన్ కలర్ డెప్త్‌తో 6.78-అంగుళాల పూర్తి-HD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAM, 256 GB స్టోరేజ్ ఉంది. ఇందులో, 16 GB వరకు వర్చువల్ ర్యామ్‌కు మద్దతు ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13.0తో రన్ అవుతుంది. రాబోయే కాలంలో ఫోన్ ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఫోన్ నాలుగు వెనుక కెమెరాలతో వస్తుంది, దీనిలో ప్రధాన కెమెరా 50MP, సెకండరీ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, మూడవ కెమెరా 2MP మాక్రో స్నాపర్ మరియు నాల్గవ కెమెరా 2MP డెప్త్ సెన్సార్. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.