40వ ఏట నుంచి 60వ ఏట వరకూ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఒక కోటి రూపాయల ఫండ్ మీ సొంతం అవుతుంది

First Published | Jun 8, 2023, 1:44 PM IST

మీ రిటైర్మెంట్ నాటికి ఒక కోటి రూపాయల ఫండ్ మీ చేతిలో ఉండాలి అనుకుంటున్నారా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి నెలకు నిర్ణీత మొత్తంలో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక కోటి రూపాయలను సులభంగా పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మీ వయసు 40 సంవత్సరాలు వచ్చేసాయా… ఇంకా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోలేదా అయితే ఏమాత్రం ఆందోళన చెందకండి.  మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు చక్కటి రిటైర్మెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు.  సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో మీరు ప్రతి నెల కొంత మొత్తంలో  పెట్టుబడి పెట్టి 20 సంవత్సరాలు పాటు కంటిన్యూ చేసినట్లయితే మీకు 60 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక కోటి రూపాయలు మీ సొంతం అవుతాయి.  ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ పద్ధతి అనేది మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓ చక్కటి సాధనం అనే చెప్పాలి.  మీ ఆదాయాన్ని బట్టి ప్రతినెల కొంత మొత్తాన్ని సిప్ ప్రాతిపదికన  ఇన్వెస్ట్ చేసినట్లయితే,  మంచి మొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.  . అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది  లాంగ్ టర్మ్ ఉంటే మంచిది. . ఎంత లాంగ్ టర్మ్ ఉంటే అంత రాబడి లభిస్తుంది.  మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా సులువైన పద్ధతి అని చెప్పాలి.  ఎందుకంటే ప్రస్తుతం అన్ని బ్యాంకులు అలాగే పలు డిజిటల్ ప్లాట్ ఫారం లు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను పెట్టేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి. 



 మీరు కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా 20 సంవత్సరాల్లో ఒక కోటి రూపాయలను వెనకేసుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎంతకాలం పెట్టాలి ఎంత రాబడి వస్తుంది అనేది లెక్కలతో సహా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా మీకు 60 సంవత్సరాలు వచ్చే నాటికి ఒక కోటి రూపాయలు మీ చేతిలో ఉంటాయి. 
 

ఉదాహరణకు మీరు 40వ ఏట మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ప్రాతిపదికన పదివేల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీరు 60 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి ఒక కోటి రూపాయలు మీ చేతిలో ఉంటాయి. 20 సంవత్సరాలు అంటే 240 నెలలు.  ప్రతినెల పదివేల రూపాయలు అంటే.  మీ పెట్టుబడి. 24,00,000 రూపాయలు అని అర్థం. కానీ మీరు 20 సంవత్సరాల్లో 99 లక్షల రూపాయలను సంపాదించే అవకాశం ఉంది. అంటే అదనంగా మీరు 75,91,479 రూపాయలు  పొందే అవకాశం ఉంది.  అది కూడా సాలీనా 12% రిటర్న్ రేటును ప్రాతిపదికగా తీసుకుంటే ఈ మొత్తంలో మీరు డబ్బులు పొందవచ్చు. 
 

20 సంవత్సరాల పాటు 10 వేలు సిప్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం సాలీనా రిటర్న్ ఆశించినా  24,00,000 రూపాయలు+ 75,91,479 రూపాయలు = 99,91,479 రూపాయలు పొందే వీలుంది. ఈ లెక్కన మీరు 40వ ఏట నుంచి 60వ ఏట వరకు నెలకు పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు మీ చేతిలో ఏకంగా కోటి రూపాయల ఫండ్ ఉండే అవకాశం ఉంది. 
 

అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ రిస్కు లోబడి ఉంటాయి.  స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోన్ అవుతూ ఉంటాయి పైన పేర్కొన్నటువంటి ఆదాయం హెచ్చుతగ్గులకు గురవచ్చు.  కచ్చితంగా ఈ ఆదాయం వస్తుందని హామీ ఇవ్వలేము.  కానీ భారతీయ స్టాక్ మార్కెట్లు గడచిన 20 సంవత్సరాలుగా గమనించినట్లయితే కంటిన్యూగా లాభాలను అందిస్తున్నాయి.  ప్రతి భా అది ఏడాది భారీ ఎత్తున మార్కెట్ క్యాపిటల్ కూడా పోగవుతోంది.  ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ప్రవేశించడం ఒక సులభ మార్గం అని చెప్పవచ్చు.  
 

గమనిక : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్కుతో కూడికున్నవి.  స్టాక్ మార్కెట్ లాభనష్టాలకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావితం అవుతుంటాయి.  కావున మీరు పెట్టుబడి పెట్టేముందు నిబంధనలు పూర్తిగా తెలుసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం.  మీ పెట్టుబడులకు లాభనష్టాలకు ఏషియా నెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు. 

Latest Videos

click me!