లూలు మాల్ లేదా డిమార్ట్… ఈ రెండింట్లో ఏ మార్కెట్లో తక్కువ ధరలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీనివల్ల బడ్జెట్లోనే అవసరమైన సరుకులు వస్తాయి. హైదరాబాద్ లో లులు మాల్ ఉంది. అలాగే అక్కడ డిమార్ట్ లు కూడా ఉన్నాయి. ఈ రెండింట్లో ఏది బెటర్?
యుఏఈకి చెందినది లూలు గ్రూప్. ఇది భారతదేశంలో అతి వేగంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇండియాలో కొచ్చిన్, లక్నో, హైదరాబాద్, తిరువనంతపురం, బెంగళూరు వంటి నగరాల్లోని లూలు మాల్స్… హైపర్ మార్కెట్, డిపార్ట్‌మెంట్ స్టోర్ అనుభూతిని ఒకేచోట అందిస్తున్నాయి. ముఖ్యంగా కొచ్చిన్ మాల్ 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అక్కడ కూరగాయలు, నిత్యావసరాలు, బ్రాండెడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు.. ఇలా 20,000కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
25
లులు మాల్ లో ఆఫర్లు
లూలు మాల్‌లో వారానికోసారి ప్రైస్ బస్టర్ ఆఫర్లు ఉంటాయి. ఈ ఆఫర్లో బియ్యం, నూనె, స్నాక్స్ వంటివి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఇవి 99 రూపాయల నుంచి దొరుకుతాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్లు కూడా వస్తాయి. ఆ సమయంలో కొంటే ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. దీపావళి, ఓనం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి పండుగల సమయంలో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలపై కూడా 70 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో అవసరమైన వస్తువులు కొనేందుకు ప్రయత్నించాలి. బ్లాక్ ఫ్రైడే, మిడ్‌నైట్ సేల్స్‌లో వంటివి కూడా ప్రకటిస్తారు. కొన్ని ఉత్పత్తులపై 90 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. లూలు హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ద్వారా పాయింట్లు సేకరించి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
35
లూలు మాల్ లో ఇవి కూడ ఉంటాయి
పిల్లలతో పాటూ లూలు మాల్ కి వెళితే షాపింగ్‌తో పాటు వినోదం కూడా అక్కడ ఉంటుంది. లక్నో లూలు మాల్‌లో బౌలింగ్, గేమింగ్ జోన్లు, పిల్లల కోసం ఆట స్థలం ఉన్నాయి. ఫుడ్ కోర్ట్‌లో అంతర్జాతీయ బ్రాండ్ల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఎన్నో ఆహార పదార్థాలు లభిస్తాయి. అక్కడకు వెళ్లాక తినకుండా వెనక్కి రాలేరు. కేవలం కొచ్చిన్ లూలు మాల్‌లోనే 20కి పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. మాల్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌లో సినిమాలు కూడా చూడవచ్చు. ఇక హైదరాబాద్ మాల్ లో కూడా ప్రత్యేకతలు ఎక్కువే.
లూలు వెబ్‌సైట్, యాప్ కూడా ఉన్నాయి. వాటి నుంచి షాపింగ్ కూడా చేయవచ్చు. అదే రోజు ఉచిత డెలివరీ, రియల్ టైమ్ కూపన్లు, డిస్కౌంట్లు, మాన్‌సూన్ షాపింగ్ ఫెస్టివల్ వంటి వి ఉంటాయి. వాటిలో 65 శాతం వరకు ఆఫర్లు లభించే అవకాశం ఉంది. డిమార్ట్ కంటే లూలు మాల్‌లో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్పత్తుల నాణ్యత అధికంగా ఉంటుంది. ఒకేసారి బల్క్‌గా కొనుగోలు చేసే వెసులుబాటు, ఆఫర్ల వల్ల ప్రజలు లూలు మాల్‌నే ఇష్టపడుతున్నారు.
55
డిమార్ట్ కంటే బెటర్?
డిమార్ట్ తో పోలిస్తే ఎన్నో రకాల ఉత్పత్తులు ఒకేచోట లభిస్తాయి. వినోద కార్యక్రమాలు, ఆన్‌లైన్ సేవల వల్ల లూలు మాల్ డిమార్ట్ కంటే కాస్త ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి. తరచుగా డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉంటుంది లూలు మాల్. కాబట్టి డిమార్ట్ తో పోలిస్తే లూలు మాల్ బెటర్ అనే చెప్పుకోవాలి.