LIC Policy : ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ ద్వారా రోజుకు రూ.45 ఆదా చేస్తూ మెచ్యూరిటీ సమయానికి రూ.25 లక్షల భారీ ఫండ్‌ను పొందవచ్చు. ఎలాగో ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ అందించే పాలసీలు ఎల్లప్పుడూ సురక్షితమైనవిగా, మంచి రాబడినిచ్చేవిగా పేరుగాంచాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి అవసరాలకు తగినట్టు ఎల్ఐసీ వివిధ రకాల ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లో ఎన్నో ప్రత్యేకమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.
తక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేస్తూ భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఫండ్‌ను కూడబెట్టుకోవడానికి ఈ ప్లాన్లు బాగా ఉపయోగపడతాయి. అలాంటి అద్భుతమైన స్కీమ్‌లలో 'ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ' ఒకటి. ఈ పాలసీ ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షల వరకు సులభంగా పొందవచ్చు.
25
పాలసీ విశేషాలు.. కనీస అర్హతలు ఇవే
తక్కువ ప్రీమియం చెల్లిస్తూ భారీ మొత్తంలో డబ్బును కూడబెట్టాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది సాధారణ టర్మ్ పాలసీ లాగే పనిచేస్తుంది. మీ పాలసీ ఎంత కాలం ఉంటే, మీరు అంతే కాలం పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అనేక రకమైన మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో కనీస బీమా మొత్తం రూ. లక్ష నుంచి ప్రారంభమవుతుంది. అయితే, గరిష్ఠ పరిమితికి సంబంధించి ఎలాంటి పరిమితి లేదు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
35
రోజుకు రూ.45 ఆదా చేస్తే చాలు
ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో నెలకు సుమారు రూ.1,358 చొప్పున జమ చేయడం ద్వారా రూ.25 లక్షల భారీ మొత్తాన్ని పొందవచ్చు. దీన్ని బట్టి చూస్తే, మీరు రోజుకు కేవలం రూ.45 మాత్రమే ఆదా చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పాలసీని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్‌గా పరిగణించాలి.
ఈ పాలసీ కాలపరిమితి 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణకు, మీరు రోజుకు రూ.45 చొప్పున ఆదా చేస్తూ 35 సంవత్సరాల పాటు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ పూర్తి అయిన తర్వాత మీకు రూ.25 లక్షల నికర మొత్తం చేతికి అందుతుంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మీరు దాచే మొత్తం ఏడాదికి సుమారు రూ.16,300 అవుతుంది.
మీరు ఈ ఎల్ఐసీ పాలసీలో ప్రతి ఏటా రూ.16,300 చొప్పున 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మొత్తం కాలానికి మీరు జమ చేసే అసలు మొత్తం రూ.5,70,500 అవుతుంది. ఇక పాలసీ నిబంధనల ప్రకారం.. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు ఉంటుంది.
దీనికి అదనంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత రివిజనరీ బోనస్ కింద రూ.8.60 లక్షలు, ఫైనల్ బోనస్ కింద రూ.11.50 లక్షలు కలుపుకుని చెల్లిస్తారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో రెండు సార్లు బోనస్ లభిస్తుంది. అయితే దీనికోసం మీ పాలసీ కనీసం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
55
అదనపు ప్రయోజనాలు ఏమిటి?
ఈ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకునే వారికి ఎలాంటి పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభించవు. అయితే, దీనిలో అదనంగా నాలుగు రకాల రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటివి ఉన్నాయి. ఇక డెత్ బెనిఫిట్ విషయానికొస్తే.. పాలసీదారుడు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినీకి పాలసీ బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125 శాతం డెత్ బెనిఫిట్ నేరుగా అందుతుంది.