ప్రపంచంలో ప్రతి దేశానికి తనకంటూ ఒక ప్రత్యేక కరెన్సీ ఉంటుంది. భారత్‌లో రూపాయి, పాకిస్థాన్‌లో పాకిస్థాన్ రూపాయి, బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశీ టాకా, అమెరికా డాలర్ ఇలా ఎన్నో కరెన్సీలు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా వినిపించే పేరు డాలర్ మాత్రమే. అమెరికా కరెన్సీ అయిన డాలర్‌లో ప్రపంచంలోని దేశాలు వ్యాపారం చేస్తాయి. ఉదాహరణకు భారత్‌లో డాలర్ కరెన్సీ కాదు, చైనాలో కరెన్సీ డాలర్ కాదు కానీ ఈ రెండు దేశాల మధ్య జరిగే లావాదేవీలు డాలర్ రూపంలో జరుగుతాయి.