Jio IPO Listing: జియో ఫ్లాట్‌ఫామ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ.. షేర్ మార్కెట్‌లో రికార్డు ప్రీమియంతో లిస్టింగ్

Published : Oct 28, 2026, 03:13 PM IST

Jio Platforms IPO Listing: రూ. 1,358 దగ్గర జియో ఫ్లాట్‌ఫామ్స్ షేర్లు రికార్డు స్థాయిలో లిస్ట్ అయ్యాయి. రూ. 12.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఎయిర్‌టెల్‌ను దాటేసి దేశంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలిచింది.

PREV
15
జియో లిస్టింగ్‌తో ఇన్వెస్టర్లకు పండగే పండుగ.. రూ. 12.5 లక్షల కోట్ల రికార్డు

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓగా నిలిచిన జియో ఫ్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) బుధవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లలో అదిరిపోయే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రూ. 30,200 కోట్ల బిగ్గెస్ట్ ఐపీఓ సైజుతో మార్కెట్‌లోకి వచ్చిన జియో షేర్లు.. ఇస్యూ ప్రైస్ రూ. 1,119తో పోలిస్తే ఏకంగా 21.36% ప్రీమియంతో రూ. 1,358 దగ్గర లిస్ట్ అయ్యాయి.

మార్కెట్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే జియో షేర్ ప్రైస్ బిఎస్ఈలో రూ. 1,375 (22.87% దాకా లాభం), ఎన్ఎస్ఈలో రూ. 1,374.50కి పెరిగింది. ఆ తర్వాత ట్రేడింగ్‌లో ఏకంగా రూ. 1,409.60 స్థాయికి చేరుకుని, ఇస్యూ ప్రైస్ కంటే దాదాపు 26% హై ప్రాఫిట్స్‌తో ట్రేడ్ అయింది.

25
ఎయిర్‌టెల్‌ను దాటేసి నంబర్ 2 స్థానంలో జియో

ధమాకా లిస్టింగ్‌తో జియో ఫ్లాట్‌ఫామ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 12.5 లక్షల కోట్లు దాటిపోయింది. ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో మార్కెట్ క్యాప్ రూ. 13,00,084.93 కోట్లకు చేరింది. దీంతో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్‌ను దాటేసి, ఇండియాలోనే సెకండ్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీగా జియో చరిత్ర సృష్టించింది.

దేశీయంగా, గ్లోబల్‌గా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఈ ఐపీఓకి మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా 1 కోటికి పైగా అప్లికేషన్లు సాధించిన ఫస్ట్ ఐపీఓగా జియో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఓపెన్ అయిన కేవలం 95 నుండి 100 నిమిషాల్లోనే వంద శాతం సబ్‌స్క్రిప్షన్ సాధించి ఫాస్టెస్ట్ ఐపీఓగా నిలిచింది. మొత్తం మీద ఈ ఐపీఓ 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, క్వాలిఫైడ్ ఇన్సిస్టిట్యూషనల్ బైయర్స్ కేటగిరీ ఏకంగా 70.55 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించింది.

35
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం.. మిగతా మెగా ఐపీఓల రికార్డులు అవుట్

ఇటీవల కాలంలో వచ్చిన ఎల్ఐసీ (LIC), హ్యుందాయ్, పేటీఎం వంటి మెగా ఐపీఓలు డిస్కౌంట్‌తో లిస్ట్ అయి ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కూడా కేవలం 1% ప్రీమియంతో లిస్ట్ అయింది. కానీ జియో ఫ్లాట్‌ఫామ్స్ ఏకంగా 21% పైగా రిటర్న్స్ ఇచ్చి మెగా ఐపీఓల విభాగంలో అత్యుత్తమ లాభాలను అందించిన కంపెనీగా నిలిచింది. షేర్‌హోల్డర్ కేటగిరీ కింద కనీస లాట్ (23 షేర్లు) పొందిన ఇన్వెస్టర్లకు లిస్టింగ్ ప్రైస్ రూ. 1,358 ప్రకారం ఒక్క లాట్‌పైనే రూ. 5,497 లాభం వచ్చింది. అలాగే రీటైల్ కేటగిరీలో మినిమం లాట్ (12 షేర్లు) పొందిన ఇన్వెస్టర్లకు రూ. 2,868 ప్రాఫిట్ దక్కింది. దాంతో ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు.

45
లిస్టింగ్ ఈవెంట్‌లో ఆనంద భాష్పాలు.. ఆకాశ్ అంబానీ గ్రాటిట్యూడ్

ఎన్ఎస్ఈలో జరిగిన లిస్టింగ్ సెర్మనీలో రిలయన్స్ గ్రూప్ ఫౌండర్ ముకేష్ అంబానీ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన పిల్లలు ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ జియో ప్రయాణం గురించి, ఫ్యామిలీ లెగసీ గురించి మాట్లాడుతుంటే 69 ఏళ్ల ముకేష్ అంబానీ, నీతా అంబానీ ఆనంద భాష్పాలు రాల్చారు.

ఈ సందర్భంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. "మా ఐపీఓని బ్లాక్‌బస్టర్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రూ. 7.5 లక్షల కోట్లకు పైగా డిమాండ్, 1.3 కోట్లకు పైగా అప్లికేషన్లు రావడం మా ఊహకు మించిపోయింది. ఇది ఒక ఎండ్ పాయింట్ కాదు.. కొత్త అధ్యాయానికి శ్రీకారం" అని అన్నారు. లిస్టింగ్ అనంతరం అంబానీ కుటుంబం ముంబైలోని శ్రీ సిద్దివినాయక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

55
నెక్స్ట్ టార్గెట్ ఏఐ.. భవిష్యత్తుపై బ్రోకరేజ్ సంస్థల చూపు

కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో ఆకాశ్ అంబానీ తమ నెక్స్ట్ విజన్‌ను స్పష్టం చేశారు. కనెక్టివిటీ, డిజిటల్ సేవల నుంచి క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీల వరకు ప్రతి భారతీయుడికి అత్యంత చౌకగా, సులభంగా అందించడమే తమ టార్గెట్ అని చెప్పారు. కాగా, మోతీలాల్ ఓస్వాల్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు జియో ఫ్లాట్‌ఫామ్స్ భవిష్యత్తుపై చాలా పాజిటివ్‌గా ఉన్నాయి.

రాబోయే రోజుల్లో టారిఫ్‌లు 15% వరకు పెరిగే అవకాశం ఉండటం, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడందుకోవడం వల్ల కంపెనీ రెవెన్యూ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. అయితే, టెలికాం రంగంలో పోటీ, టెక్నాలజీ మార్పులు, రెగ్యులేటరీ నిబంధనలు, మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పై ఆధారపడటం వంటి కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories