ఒక్క రీఛార్జ్‌తో కుటుంబం మొత్తానికి ఉచితంగా డేటా, కాల్స్‌.. సూపర్‌ ప్లాన్‌.

First Published | Jan 11, 2025, 9:52 AM IST

ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఫోన్స్ ఉంటున్న రోజులివీ. దీంతో ప్రతీ ఒక్క ఫోన్ కు రీఛార్జ్ చేయాల్సిందే. కుటుంబ సభ్యులందరికీ ఒకే రీఛార్జ్ ప్లాన్ ఉంటే ఎలా ఉంటుంది.? ఇలాంటి వారి కోసమే జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ఫ్యామిలీ ప్లాన్ తో కుటుంబ సభ్యులందరికీ ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

జియో పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్..

యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ప్లాన్స్ ను తీసుకొస్తున్న జియో తాజాగా పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ను తీసుకొచ్చింది. జియో రూ. 449 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో 3 ఆడ్ ఆన్ సిమ్ లను అందిస్తోంది. ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎమ్ఎస్ లతో పాటు 25 జీబీ డేటా పొందొచ్చు. 

జియో ఫ్యామిలీ ప్లాన్‌..

జియో 2025 లో రెండు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి రూ. 449 కాగా మరొకటి రూ. 749. ఒక రీఛార్జ్ తో మొత్తం మూడు సిమ్ లు యాక్టివేట్ లో ఉంటాయి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు సైతం ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. 


జియో ₹449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వివరాలు

జియో ₹449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఇందులో 3 యాడ్ ఆన్ సిమ్ లు లభిస్తాయి. మెయిన్ యూజర్ కు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS లతో పాటు 75 జీబీ డేటా పొందొచ్చు. అదే విధంగా జియో సినిమా, జియో సావన్ వంటి యాప్స్ కు ప్రత్యేకంగా అపరిమి 5జీ డేటా పొందొచ్చు. ఇక యాడ్ ఆన్ సిమ్ లకు కాల్స్, SMSలతో పాటు 5జీబీ డేటా పొందొచ్చు. 

జియో ₹749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వివరాలు

జియో ₹749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ లో కూడా 3 యాడ్ ఆన్ సిమ్ లను పొందొచ్చు. వీరిలో మెయిన్ యూజర్ కు 100 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచితం SMS, అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందొచ్చు. ఇక యాడ్ ఆన్ సిమ్ లకు ఉచిత కాల్స్, SMSలతో పాటు 5జీబీ డేటా లభిస్తుంది.అదనంగా నెట్ ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకే ఇంట్లో మూడు ఫోన్ లు ఉపయోగిస్తున్న వారికి ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్స్ గా చెప్పొచ్చు. 

Latest Videos

click me!