బడ్జెట్ కు.. ఆర్థికమంత్రి చీరలకు లింకుందా? ఈ సారి ఏ రంగు చీర కట్టుకోబోతున్నారు??

First Published | Jan 30, 2024, 11:59 AM IST

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ఇంకా ఒక్కరోజే సమయం ఉంది. ఇప్పుడంతా ఆమె ఏ రంగు చీర కట్టుకోబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే యేటా బడ్జెట్ సమర్పణ సమయంలో ఆమె కట్టుకునే చీరలు బడ్జెట్ ను ఏదో రకంగా ప్రతిబింబించేవిగానే ఉన్నాయి. 

2019లో మొదటిసారిగా ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలాసీతారామన్. ఆ సమయంలో ఆమె బంగారుజరీ అంచు ఉన్న మంచి గులాబీరంగు మంగళగిరి చీర కట్టుకున్నారు. 

ఈ బడ్జెట్ సమయంలో పూర్తికాలపు మహిళా ఆర్థిక మంత్రిగానే కాకుండా.. సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో ‘బహీ ఖాతా’ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సాధించారు నిర్మలాసీతారామన్. ఈ బహీఖాతా కోసం ఎరుపురంగు సిల్క్ క్లాత్ తో బడ్జెట్ పేపర్లను చుట్టారు. ఈ బట్టమీద జాతీయ చిహ్నం ముద్రించి ఉంది. 


2020లో బడ్జెట్ సమర్ఫణను ఆర్థికమంత్రి బంగారు పసుపు రంగు సిల్క్ చీరను కట్టుకున్నారు. దీనికి సన్నటి బ్లూ రంగు బార్టర్.. అంచులకు గోల్డ్ డిజైన్ తో మంచి ఆకర్షణీయంగా ఉందీ చీర. దీనికి పసుపురంగు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నారు. 

పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా చూస్తారు. ప్రత్యేకమైన రోజుల్లో దీన్ని ధరించడానికి ఇష్టపడతారు. 2020 బడ్జెట్ సమయంలో భారత్ మహమ్మారినుంచి కోలుకుని ఆర్థికవృద్ధిని సాధించే ప్రయత్నం చేయడాన్ని ప్రతిబింబిచేలా ఈ చీర ఉంది.

2021లో.. నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర తెలుగు వారికి గౌరవాన్ని కలిగించింది. ఆ యేడు బడ్జెట్ సమర్ఫణ సమయంలో ఆమె తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు-హాఫ్ వైట్ సమ్మేళనం అయిన ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను కట్టుకున్నారు. ఈ చీరకు పల్లు మొత్తం ఇక్కత్ పాటర్స్ తో.. సన్నటి గ్రీన్ బార్డర్ తో ఉంటుంది. 

సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారయ్యింది. ఈ చీర తయారీలో సిల్క్, కాటన్ రెండూ మిక్స్ చేశారు. 1970లలో ఇలాంటి చీరలను నేయడం మొదలుపెట్టారు. 

ఆ సమయంలో సిల్క్ లో కాటన్ మిక్స్ చేసి నేయాలని ఆలోచించారు. దాని ప్రతిరూపమే ఈ చీరల తయారీ. నిర్మలా సీతారామన్ ఈ చీరకు ఎరుపురంగు బ్లౌజ్ మ్యాచ్ చేశారు.

2022 లో సీతారామన్ బ్రౌన్ కలర్ బొమ్కౌ చీర కట్టుకున్నారు. ఒడిశాలో ఈ చీరలు తయారవుతాయి. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ కలర్ బార్డర్.. చీరలో సిల్వర్ కలర్ డిజైన్ ఉంది. మెరూన్, బ్రైన్ కాంబినేషన్ చీరకు బ్రౌన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకున్నారు

బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను..సూచిస్తుంది. ఎరుపు ప్రేమ, పవర్ లను సూచిస్తుంది. ఈ రెండింటి కాంబో చీరను 2022 బడ్జెట్ సమర్ఫణ సమయంలో కట్టుకున్నారామె. 

2023లో నిర్మలా సీతారామన్ ఎరుపురంగు టెంపుల్ బార్డర్ చీర కట్టుకున్నారు. ఎరుపురంగుకు నలుపురంగు జరీ బార్డర్ దానిమీద టెంపుల్ డిజైన్ వచ్చింది.  ఎరుపు రంగు ప్రేమకు, ధైర్యానికి, నిబద్ధతతకు, సాహసానికి గుర్తుగా చూస్తారు. హిందూ సంప్రదాయంలో ఎరుపును దుర్గామాతకు ప్రతిరూపంగా చూస్తారు. మహిళా శక్తికి సూచికగా చెబుతారు. 

ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లో గానీ, సిల్క్ లో గానీ.. లేదా రెండింటి మిక్స్ లో కానీ దొరుకుతాయి. ప్రత్యేక సందర్భాలకు కట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. నిర్మలా సీతారామన్ కట్టుకున్న ఈ చీరలో చుక్కల లాంటి డిజైన్ కూడా ఉంది. 

ఈ సారి మరో ప్రత్యేకం.. ఎరుపురంగు డిజిటర్ టాబ్లెట్. ఈ ఎరుపురంగు డిజిటల్ టాబ్లెట్ లో బడ్జెట్ ను సీతారామన్ సమర్పించారు. 
 

Latest Videos

click me!