ఈ ఒక్కటి చేస్తే మీరు లోన్ తీసుకోకుండా సొంతిల్లు కొనుక్కోవచ్చు

First Published | Sep 17, 2024, 11:34 AM IST

సొంత ఇల్లు కొనుక్కోవాలని మనందరికీ ఉంటుంది కదా. అయితే దాచుకున్న డబ్బంతా పెట్టుబడి పెట్టలేక, పెట్టినా ప్రతి నెలా వేలకు వేలు EMIలు కట్టలేక మనలో చాలామంది సొంత ఇంటి కలను కలగానే వదిలేస్తుంటారు. ఇంత కష్టపడకుండా లోన్ కూడా తీసుకోకుండా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనలు పాటిస్తే సుమారు రూ.కోటి విలువైన సొంతిల్లు మీ సొంతమవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

ఒక మధ్య తరగతి మనిషి జీవిత లక్ష్యం ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వారి చదువులు, వారి పెళ్లిళ్లు, ఫైనల్ గా ఇల్లు కొనడం. ఇవన్నీ పూర్తయ్యే సరికి ఆటోెమెటిక్ గా ఓల్డేజ్ వచ్చేస్తుంది. చాలా మంది ఇళ్లలో ఇదే జరిగుంటుంది. కావాలంటే మీరూ ఓసారి చెక్ చేసుకోండి. అయితే ఇంతకు ముందు పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా.. అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇల్లు కట్టడం సింపుల్. లోన్లు ఇస్తున్నారు. వాటిని EMIల రూపంలో కట్టి సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రాబ్రమ్ ఏంటంటే జీవితాతం EMIలు కట్టుకుంటూ కూర్చోవాలి. కొంతమంది డౌన్ పేమెంట్ కోసం తగినంత డబ్బు ఆదా చేయకుండానే అది కూడా అప్పుగా తెచ్చి ఇల్లు కొనుక్కుంటారు. 

సొంతంగా స్థలం కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకోవడం మరింత ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఎక్కువ మంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారు. ఇందులోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయట. ప్లాట్ విలువ ప్రతి సంవత్సరం తగ్గుతుందని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయాల్లో ఒక చిన్న ఆలోచనను అనుసరించడం ద్వారా పదేళ్ల తర్వాత మీరు అప్పు తీసుకోకుండా ఇల్లు కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos


మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి

మీరు కొనాలనుకుంటున్న ఫ్లాట్ ధర రూ.50 లక్షలు ఉందనుకుందాం. దీనిలో రూ.10 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉంటే మీరు ఇంకా రూ.40 లక్షలు రుణం తీసుకోవాలి. దీనికి బదులుగా ఫస్ట్ మీరు రూ.10 లక్షలను మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టండి. ఇది సంవత్సరానికి 15 శాతం వృద్ధి చెందే అవకాశం ఉంది. పది సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే దాదాపు రూ.40 లక్షలు ఆదా అవుతుంది.

దశలవారీ పెట్టుబడి

మీరు రూ.40 లక్షల రుణం తీసుకొని ప్రస్తుతం ఇల్లు కొనుకొన్నారనుకోండి మీరు 20 సంవత్సరాల పాటు EMIలు కట్టాలి. అంటే 9 శాతం వడ్డీ చొప్పున మీరు నెలకు రూ.36,000 EMI చెల్లించాలి. అలా కాకుండా ఇదే అమౌంట్ ను ఇప్పటి నుంచే మీరు సేవ్ చేయడం ప్రారంభించండి. 

ప్రస్తుత మీరు అద్దెకి ఇల్లు తీసుకోండి. రెంట్ రూ.10,000 కేటాయించండి. ప్రతి నెలా రూ.26,000ను దశలవారీ పెట్టుబడి పద్ధతిలో పెట్టుబడి పెట్టండి. దీనికి 14 శాతం వడ్డీ వస్తుంది. ఇలా చేయాలంటే మీరు మ్యూచువల్ ఫండ్లలో పది సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా చేస్తే పదేళ్ల తర్వాత మొత్తం రూ.68 లక్షలు వస్తుంది.  

మొదట మీరు దాచుకున్న రూ.10 లక్షల పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం వల్ల పదేళ్లకు రూ.40 లక్షల వరకు వస్తుంది. ప్రతి నెలా రూ.26,000 చొప్పున పదేళ్ల పాటు  దశలవారీ పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.68 లక్షల వరకు వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత మీ చేతిలో మొత్తం రూ.1.08 కోట్లు ఉంటాయి.

రియల్ ఎస్టేట్ బూమ్ ప్రకారం పది సంవత్సరాల తర్వాత స్థిరాస్తి విలువ పెరిగిందనుకుందాం. అంటే ఇప్పడు రూ. 50 లక్షలు పలికిన ఇల్లు మరో పదేళ్లలో రూ. కోటి పలుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పదేళ్ల తర్వాత మీ దగ్గర కోటి రూ పాయలకు పైగానే డబ్బులు సేవ్ అయి ఉంటాయి. అందువల్ల  ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లాట్ కొనుగోలు చేయవచ్చని నిపుణులు అంటున్నారు. సొంతింటి కలను అప్పు చేయకుండా సాకారం చేయవచ్చని చెబుతున్నారు. 

click me!