వ్యాపారం చేయడమేమీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. ప్రస్తుతం మార్కెట్లో చాలా వ్యాపార అవకాశాలు ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు కూడా వ్యాపారం చేయడం ద్వారా ఆదాయం పొందాలి అనుకుంటే, ప్రస్తుతం ఇంకో మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతి నెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.
కోడిగుడ్ల బిజినెస్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. అయితే దీని కోసం మీరు ముందుగా మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే పెట్టుబడి ఎంత పెట్టాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మీరు అన్నంలోకి అడుగు పెట్టి డబ్బు సంపాదించవచ్చు. అవగాహన లేకుండా ఈ రంగంలోకి దిగినట్లయితే మీరు భారీ ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కోడిగుడ్ల హోల్ సేల్ బిజినెస్ గురించి దానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కోడిగుడ్ల హోల్సేల్ బిజినెస్ కోసం ముందుగా మీరు పౌల్ట్రీ ఫారంల వద్ద నుంచి గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. అనంతరం మీరు ఓ షాపును అద్దెకు తీసుకొని కోడిగుడ్లను అక్కడ అమర్చుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఓ కమర్షియల్ ట్రక్ ద్వారా మీ సమీపంలో ఉన్న కిరాణా షాపులు చికెన్ షాపులు అదే విధంగా హాస్టల్ లో రెస్టారెంట్లకు కోడిగుడ్లను సప్లై చేయవచ్చు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హాస్టల్స్ వంటి వాటికి కోడిగుడ్ల అవసరం ఉంటుంది. కావున వారికి మీరు రెగ్యులర్ గా సప్లై చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
దాంతోపాటు కిరాణా షాపులకు కూడా మీరు రెగ్యులర్ గా కోడిగుడ్లను సప్లై చేయవచ్చు. అయితే కోడి గుడ్లను సప్లై చేయడానికి ఒక కమర్షియల్ ట్రక్ ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కేసుల ద్వారా మీరు కోడిగుడ్లను సప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ప్రారంభ పెట్టుబడి కింద సుమారు రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది. అలాగే కమర్షియల్ ట్రక్ కోసం కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీరు ట్రక్కును అదే ప్రాతిపదికనగాని సొంతంగా గాని వాడవచ్చు. సొంతంగా ట్రక్ కొనుగోలు చేయాలంటే, ఫైనాన్స్ పద్ధతిలో మీరు ట్రక్కు కొనుగోలు చేయవచ్చు తద్వారా మీరు ప్రతి నెల ఈఎంఐ కడితే సరిపోతుంది.
ఇక మీరు సప్లై మొదలుపెట్టేముందు మార్కెట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు అదే విధంగా కోడిగుడ్లకు డిమాండ్ ఉన్న ప్రదేశాల్లో మీకు సప్లై ప్రారంభిస్తే మంచిది. అలాగే మీ హోల్సేల్ షాపు వద్ద కూడా బయటదరకన్నా కూడా కొద్దిగా తక్కువ ధరతో టోకుగా కోడిగుడ్లను విక్రయించినట్లయితే మీకు అదనంగా ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ బిజినెస్ తో పాటు అదనంగా మీరు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మరింత ఎక్కువ ఆదాయం లభించే అవకాశం ఉంది.