ఎండు మిరపకాయల్లాగా కనిపిస్తున్న ఈ వింత పదార్థం ధర ఒక కిలో సుమారు 70 లక్షలు రూపాయలు. ఒక గ్రాము విలువ అయితే దాదాపు 7000 రూపాయలు. ఈ పదార్థంలో ఏం స్పెషాలిటీ ఉందా అని ఆలోచిస్తున్నారా.. దీన్ని హిమాలయన్ వయాగ్రా (Himalayan Viagra) అని పిలుస్తారు. లైంగిక సంబంధిత వ్యాధులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని చైనా లో పేరు ఉంది. వీటికి చైనా తో పాటు కొరియా, థాయిలాండ్, జపాన్ వంటి దేశాల్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉంది.