Lifetime Free Credit Card : చిన్న ట్రిక్ ప్లే చేశారో.. లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు మీసొంతం

Published : Aug 14, 2026, 10:31 AM ISTUpdated : Aug 14, 2026, 10:46 AM IST

మీకు క్రెడిట్ కార్డు సేవలు అందిస్తున్నందుకు బ్యాంకులు యాన్యువల్ ఛార్జెస్ (వార్షిక రుసుములు) వసూలు చేస్తున్నాయా? అయితే ఈ ఛార్జెస్ కట్టకుండా లైఫ్ టైమ్ ఫ్రీగా క్రెడిట్ కార్డు వాడుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.

PREV
16
లైఫ్ టైమ్ ఫ్రీగా క్రెడిట్ కార్డు... ఎలా పొందాలో తెలుసా?

ప్రస్తుతం ప్రతి ఉద్యోగికి క్రెడిట్ కార్డు ఇస్తున్నాయి బ్యాంకులు. మంచి ఆదాయం కలిగివుండి సిబిల్ స్కోరు బాగుంటే చాలు… క్రెడిట్ కార్డు పొందవచ్చు. ఇలాంటివారికి బ్యాంకులు పోటీపడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. అయితే క్రెడిట్ కార్డు పొందడం ఈజీనే కానీ దాన్ని మెయింటేన్ చేయడం చాలాకష్టం… మనం వాడుకున్న డబ్బులను సమయానికి తిరిగి కట్టుకుంటే వడ్డీ, చక్రవడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతేకాాదు వివిద సర్వీస్ చార్జీల పేరిట బ్యాంకులు డబ్బులు వసూలు చేస్తాయి… ఇందులో ప్రతి ఏటా వసూలుచేసే యాన్యూవల్ ఛార్జెస్ ఒకటి.

చాలామంది ఏటా కట్టే క్రెడిట్ కార్డు యాన్యువల్ ఛార్జెస్ నుండి తప్పించుకోవాలని చూస్తుంటారు. అయితే కొన్నిసార్లు బ్యాంకులే తమ రెగ్యులర్ లేదా పెయిడ్ క్రెడిట్ కార్డును 'లైఫ్‌టైమ్ ఫ్రీ'గా మార్చే ఆఫర్ ఇస్తాయి. అసలు బ్యాంకులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటాయి? పెయిడ్ క్రెడిట్ కార్డు వాడుతున్న కస్టమర్లు తమ కార్డును లైఫ్‌టైమ్ ఫ్రీగా ఎలా మార్చుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

26
లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి?

లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే దీని కోసం జాయినింగ్ ఫీజు గానీ, వార్షిక రెన్యువల్ ఫీజు గానీ కట్టాల్సిన అవసరం లేదని అర్థం. అంటే క్రెడిట్ కార్డు సేవలు అందిస్తున్నందుకు బ్యాంకులు ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయవన్నమాట. ఈ కార్డు ద్వారా వాడుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తే చాలు… ఇతర ఛార్జీలేవీ ఉండవు.

కార్డు 'ఫ్రీ' గా ఇస్తున్నారు కదా… ఇక అన్నీ ఉచితం అనుకోవద్దు. బిల్లు ఆలస్యంగా కడితే వడ్డీ, లేట్ పేమెంట్ ఛార్జీలు, ఏటీఎం నుంచి డబ్బు తీస్తే క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు యథావిధిగా ఉంటాయి. అందుకే కార్డు తీసుకునే ముందు ఇతర ఛార్జీల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

36
బ్యాంకులు లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు ఎందుకు ఇస్తాయి?

బ్యాంకులు కస్టమర్లపై దయతో యాన్యువల్ ఫీజును మాఫీ చేయవు. దీని వెనుక కస్టమర్లను తమవద్దే నిలుపుకోవాలనే వ్యాపార వ్యూహం ఉంటుంది. కొత్త కస్టమర్‌ను సంపాదించడానికి అయ్యే మార్కెటింగ్ ఖర్చు కంటే ఉన్న కస్టమర్‌ను కాపాడుకోవడమే బ్యాంకుకు లాభదాయకం. అందుకే ఆర్థిక క్రమశిక్షణ కలిగిన కస్టమర్స్ కి లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి.

ఇలా ఉచితంగానే క్రెడిట్ కార్డు సేవలు అందిస్తే బ్యాంకులకు లాభమేంటి? అనే డౌట్ మీకు వచ్చి వుంటుంది. అయితే యాన్యువల్ ఫీజు లేకున్నాా క్రెడిట్ కార్డుపై చేసే లావాదేవీలు, ఈఎంఐల ద్వారా కూడా బ్యాంకులకు ఆదాయం వస్తుంది. అందుకే రెగ్యులర్‌గా కార్డు వాడే మంచి కస్టమర్లకు ఫీజు మాఫీ ఆఫర్ ఇస్తాయి.

46
కార్డును లైఫ్‌టైమ్ ఫ్రీగా మార్చే సులభమైన పద్ధతి ఇదే..

మీరు క్రెడిట్ కార్డును రెగ్యులర్‌గా వాడుతూ, బిల్లులు టైమ్‌కి కడుతున్నారా? అయితే కార్డును క్లోజ్ చేస్తున్నట్లు బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టండి. కస్టమర్‌ను కోల్పోకుండా ఉండేందుకు బ్యాంకు రిటెన్షన్ టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. అప్పుడు వాళ్లే యాన్యువల్ ఫీజు రద్దు చేయడం లేదా కార్డును లైఫ్‌టైమ్ ఫ్రీగా మార్చే ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ అందరికీ, అన్ని కార్డులకూ వర్తించకపోవచ్చు. ఇది పూర్తిగా బ్యాంకు పాలసీ, మీ లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది.

56
క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడినా యాన్యువల్ ఫీజు మాఫీ?

కొన్ని క్రెడిట్ కార్డులపై ఏడాదిలో నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేస్తే వార్షిక రుసుమును మాఫీ చేస్తారు. కాబట్టి మీ కార్డు నిబంధనల్లో ఈ సౌకర్యం ఉందో లేదో చెక్ చేసుకోండి. బ్యాంకు నిర్దేశించిన వార్షిక వ్యయ పరిమితిని మీరు దాటుతున్నట్లయితే, కొన్ని కార్డులపై ఆటోమేటిక్‌గా యాన్యువల్ ఫీజు మాఫీ అవుతుంది. కార్డును క్లోజ్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోవడం మంచిది.

66
కార్డు క్లోజ్ చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
  • కేవలం వార్షిక రుసుము కోసమే క్రెడిట్ కార్డును మూసివేయడంలో తొందరపడొద్దు. ముందుగా బ్యాంకును సంప్రదించి లైఫ్‌టైమ్ ఫ్రీ లేదా ఫీజు మాఫీ ఆఫర్ ఉందేమో అడగండి.
  • కార్డును క్లోజ్ చేస్తే మీ మొత్తం క్రెడిట్ లిమిట్, క్రెడిట్ హిస్టరీపై ప్రభావం పడుతుందని గుర్తుంచుకోండి.
  • బ్యాంకు నుంచి ఏ ఆఫర్ తీసుకున్నా, దాని నియమ నిబంధనలను స్పష్టంగా అర్థం చేసుకోండి.
Read more Photos on
click me!

Recommended Stories