PPF Investment: నెలకు రూ. 1900 సేవ్ చేస్తే 1 కోటి వస్తుందా? పీపీఎఫ్ మ్యాజిక్ ఇది !

Published : Sep 25, 2026, 01:44 PM IST

PPF Calculation: పిల్లల భవిష్యత్తు కోసం నిలకడగా పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక సురక్షితమైన, అద్భుతమైన మార్గం. కేంద్ర ప్రభుత్వం అందించే గ్యారెంటీ, చక్రవడ్డీ, పూర్తి పన్ను మినహాయింపులతో పీపీఎఫ్ ఖాతా ఉంటుంది.

PREV
15
పీపీఎఫ్ తో ₹1,00,00,000 ఫండ్ ఖాయం

ప్రతి తల్లిదండ్రుల అతిపెద్ద కల తమ పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా మార్చడమే. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు లేదా వారి రిటైర్మెంట్ సమయానికి భారీ నిధిని సిద్ధం చేయాలని ప్లాన్స్ వేస్తుంటారు. దీనికోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒక అద్భుతమైన, పూర్తి సురక్షితమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

పీపీఎఫ్‌లో ఉన్న కాంపౌండింగ్ పవర్ వల్ల మీరు నెలకు కేవలం ₹1,900 వంటి చిన్న మొత్తాన్ని దాచుకుంటూ పోయినా, మీ పిల్లల కోసం ఏకంగా ₹1 కోటి నిధిని సులభంగా తయారు చేయవచ్చు. అసలు ఈ క్యాలిక్యులేషన్ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం.

25
నెలకు ₹1,900 ఇన్వెస్ట్‌మెంట్‌తో ₹1 కోటి ఫండ్ ఎలా సాధ్యం?

మీకు బాబు లేదా పాప పుట్టిన వెంటనే వారి పేరు మీద పొదుపు ప్రారంభించడం మొదటి మార్గం. రోజుకు కేవలం ₹63 పొదుపు చేస్తే చాలు. ఇది నెలకు ₹1,900 ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుతుంది.

• నెలకు ఇన్వెస్ట్‌మెంట్: ₹1,900 (రోజుకు ₹63 పొదుపు)

• ఏడాదికి ఇన్వెస్ట్‌మెంట్: ₹22,800

• ప్రస్తుత వడ్డీ రేటు: ఏటా 7.1% (కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రభుత్వ రేటు)

• పెట్టుబడి కాలపరిమితి: దాదాపు 50 సంవత్సరాలు (15 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అకౌంట్ విస్తరించాలి)

• మొత్తం మీరు కట్టేది: 50 ఏళ్లలో మీరు జమ చేసే అసలు మొత్తం ₹11,62,800.

• వడ్డీ ఆదాయం: కాంపౌండింగ్ మ్యాజిక్ వల్ల మీకు లభించే వడ్డీ దాదాపు ₹91,80,000.

• మొత్తం మెచ్యూరిటీ ఫండ్: 50 ఏళ్ల తర్వాత చేతికి వచ్చే మొత్తం ₹1,03,42,000 (రూ.1 కోటికి పైగా).

అంటే మీ పిల్లలకు 51 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వారు తమ జేబు నుంచి అదనంగా రూపాయి తీయకుండానే కోటీశ్వరులు అవుతారు.

35
5 ఏళ్ల వయస్సులో స్టార్ట్ చేస్తే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది?

ఒకవేళ మీ పిల్లలకు 5 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే లెక్కల్లో చిన్న మార్పు వస్తుంది. 45 ఏళ్ల పాటు ప్రణాళిక ప్రకారంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

• నెలకు ఇన్వెస్ట్‌మెంట్: ₹2,700

• కాలపరిమితి: 45 సంవత్సరాలు

• మొత్తం మీరు కట్టేది: ₹14.58 లక్షలు

• వడ్డీ రూపంలో వచ్చేది: ₹87.58 లక్షలకు పైగా

• మొత్తం ఫండ్: మీ పిల్లల 50 ఏళ్ల వయస్సు నాటికి ₹1.02 కోట్ల నిధి సిద్ధమవుతుంది.

45
పీపీఎఫ్ పథకంలో ఉన్న ప్రధాన ప్రయోజనాలు ఇవే

పీపీఎఫ్ ఖాతా తెరవడం వల్ల అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.

1. 100% పన్ను మినహాయింపు

పీపీఎఫ్ పెట్టుబడులకు అతిపెద్ద ప్లస్ పాయింట్ టాక్స్ ఫ్రీ కావడమే. ఇది 'Exempt-Exempt-Exempt' (EEE) కేటగిరీ కిందకు వస్తుంది. ఇన్ కమ్ టాక్స్ సెక్షన్ 80C కింద ఏడాదికి ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా ప్రతీ ఏటా వచ్చే వడ్డీ, చివర్లో మెచ్యూరిటీ సమయంలో వచ్చే ₹1 కోటి రూపాయిలు కూడా పూర్తిగా టాక్స్ ఫ్రీ.

2. 15 ఏళ్ల లాక్-ఇన్, 5 ఏళ్ల ఎక్స్‌టెన్షన్

పీపీఎఫ్ అకౌంట్ రూల్స్ ప్రకారం మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అయితే ₹1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి 15 ఏళ్ల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయకూడదు. ఒక చిన్న ఫారమ్ పూర్తి చేసి ప్రతి 5 ఏళ్ల బ్లాక్ చొప్పున అపరిమితంగా పొడిగించుకోవచ్చు.

55
ఖాతా ఎవరు తెరవవచ్చు? పెట్టుబడి పరిమితులు ఎంత?

ఏ తండ్రి లేదా తల్లి అయినా తమ మైనర్ పిల్లల పేరు మీద ఏదైనా పోస్టాఫీస్ లేదా అధీకృత బ్యాంకులో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

• నిర్వహణ: పసిపిల్లల పేరు మీద ఓపెన్ చేసినా, వారికి 18 ఏళ్లు నిండి మేజర్ అయిన తర్వాత ఖాతా నిర్వహణ వారి చేతికి వస్తుంది. అప్పటినుంచి వారే సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించవచ్చు.

• డిపాజిట్ లిమిట్స్: ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతాలో కనీసం ₹500 నుంచి గరిష్ఠంగా ₹1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. మీరు నెలకు ₹1,900 కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే, ఈ ₹1 కోటి లక్ష్యం 51 ఏళ్ల కంటే ముందే పూర్తవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories