దుబాయి నుంచి ఎంత బంగారం కొని తెచ్చుకోవచ్చో తెలుసుకోండి..లేకుంటే జైలు పాలయ్యే అవకాశం..

First Published Sep 6, 2022, 1:34 PM IST

విదేశాల నుంచి బంగారం అక్రమంగా తెస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టుల్లో అరెస్టు చేసిన వార్తలను మనం వార్తల్లో చూస్తుంటాం. చాలా మంది బంగారాన్ని పేస్ట్‌ రూపంలో సైతం భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంంటారు. అలాగే కడుపులో కూడా పెట్టుకొని మరీ తెస్తూ విమానాశ్రయంలో  పట్టుబడుతుంటారు. 
 

Image Credit: Getty Images

నిజానికి విదేశాల నుంచి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో చాలా మందికి తెలియదు. చాలా మంది దుబాయి నుంచి బంగారాన్ని తీసుకువస్తుంటారు. దుబాయ్‌ని సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలుస్తుంటారు. దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు తమ వెంట బంగారాన్ని తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే అక్కడ బంగారంపై పన్ను ఉండదు. పన్ను విధించకపోవడం వల్ల అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.  

ఈ కారణంగా చాలా మంది దుబాయ్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి భారత్‌కు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు.  అయితే దుబాయి నుంచి బంగారం తీసుకురావడానికి కొన్ని  నియమ, నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చు అనే సమాచారాన్ని తెలుుసుకుందాం. 

దుబాయ్ లేదా మరేదైనా  విదేశంలో ఒక సంవత్సరానికి పైగా నివసిస్తున్న భారతీయులు అతను ఎటువంటి పన్ను లేకుండా భారతదేశానికి రూ. 50,000 లేదా 2,500 దిర్హామ్ వరకు విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. ఈ నియమం పురుషులకు వర్తిస్తుంది. అయితే మహిళా ప్రయాణికులు రూ. 1, 00, 000 విలువ గల ఆభరణాలను ఉచితంగా తీసుకురావడానికి అనుమతి ఉంది.

ఒక భారతీయ యాత్రికుడు 1 కిలో బంగారాన్ని తీసుకువస్తే, అతను భారతీయ మార్కెట్‌లో బంగారం ధరలో 10 శాతం పన్ను చెల్లించాలి. 1 కిలో కంటే ఎక్కువ బంగారం ఉంటే, దాని ప్రకారం బంగారం ధరలో 36.05 శాతం పన్ను చెల్లించాలి.  ఇది కాకుండా, మీరు పరిమితికి మించి బంగారం కలిగి ఉంటే, దాని గురించి సంబంధిత అధికారులకు ముందుగానే తెలియజేయవలసి ఉంటుంది. ఇది కాకుండా, మీరు ఈ బంగారు నగల బిల్లులను కూడా మీ వద్ద ఉంచుకోవాలి.

యుఎఇ నుండి భారతదేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ తనిఖీ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ప్రయాణీకుడు తన బ్యాగేజీలోని వస్తువులను విమానాశ్రయాలలో అందించిన నిర్దేశిత భారతీయ కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌లో ప్రకటించాలి.

బంగారం కాకుండా ఇతర వస్తువులను తీసుకురావడానికి నియమాలు ఏమిటో తెలుసుకోండి
అన్నింటిలో మొదటిది, ఎవరైనా విదేశాల నుండి భారతదేశానికి వచ్చినప్పుడు, అతను విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక ఫారమ్ నింపాలి. ఈ ఫారమ్‌లో, అతను విదేశాలలో చేసిన కొనుగోళ్ల గురించి లేదా తనతో తీసుకువచ్చే వస్తువుల గురించి సమాచారాన్ని పూరించాలి.

విదేశాల నుండి భారతదేశానికి తీసుకువచ్చే వస్తువులపై పన్న, ఆ ప్రయాణికుడు విదేశాలలో గడిపిన రోజుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది, దానికి అనుగుణంగా పన్ను విధించబడుతుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమతో పాటు రూ.50, 000 వరకు విలువైన వస్తువులను తీసుకురావచ్చు. రూ. 15,000 వరకు వస్తువులపై ఎలాంటి పన్ను లేదు.

click me!