ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని బ్యాంకు అకౌంట్స్ తెరవవచ్చో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు అకౌంట్స్ తెరవడానికి అవకాశం ఉంది. వీటిలో కరెంట్ అకౌంట్స్, జీతం అకౌంట్స్, జాయింట్ అకౌంట్స్ లేదా సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి.
సేవింగ్స్ అకౌంట్ అనేది సాధారణంగా అందరూ ఓపెన్ చేసే అకౌంట్. దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సేవింగ్స్ పెట్టిన మొత్తంపై వడ్డీ కూడా వస్తుంది. ఎక్కువ లావాదేవీలు ఉన్న వ్యక్తులు కరెంట్ అకౌంట్ అప్షన్ ఎంచుకోవాలి. కరెంట్ అకౌంట్ ఎక్కువగా వ్యాపారవేత్తలు సెలెక్ట్ చేసుకుంటుంటారు. జీతం ఉన్న వ్యక్తులు సాలరీ అకౌంట్ లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవచ్చు.
ఎన్ని అకౌంట్స్ తెరవవచ్చు?
భారతదేశంలో ఒక వ్యక్తి తెరవగల ఫిక్స్డ్ నంబర్ బ్యాంక్ అకౌంట్స్ లేవు. అంటే దీనికి ఒక పరిమితి అంటూ లేదు. ఏ వ్యక్తి అయినా తన ఇష్టం ఇంకా అవసరాలకు అనుగుణంగా అనేక బ్యాంకు అకౌంట్స్ తెరవవచ్చు. దీనికి ఆర్‌బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు.
కానీ, ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ తెరిచేటప్పుడు, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్ని అకౌంట్స్ తప్పనిసరిగా మినిమమ్ బ్యాలెన్స్ తో మెయింటైన్ చేయాలి. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ లేదా ఇతర అకౌంట్స్ తెరవవచ్చు. అయితే దీని కోసం మీరు బ్యాంకింగ్ అన్ని నియమాలను పాటించాలి.