మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా ధరలు భారీగా తగ్గిస్తూ అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాబ్ వంటి దిగ్గజ కంపెనీలు వాటి వాహనాల సేల్స్ పెంచేలా అనేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పుడు హోండా కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రెండు మోడల్స్ బుకింగ్స్ ఓపెన్ చేశాయి. మీరు గాని హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొనే ఆలోచనలో ఉంటే వెంటనే బుకింగ్ చేసుకోండి.
హోండా కంపెనీ ఆక్టివా ఇ, క్యూసి 1 అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ మోడల్స్ ప్రస్తుతం ప్రధాన నగరాల్లోని డీలర్షిప్ లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆక్టివా ఇ ఢిల్లీ, ముంబై, బెంగళూరులో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. QC1 ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్ లలో బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ రెండు మోడల్స్ లో మీరు ఏది బుక్ చేయాలనుకున్నా రూ.1,000 కడితే సరిపోతుంది. అయితే త్ఆవరతలో జరుగనున్న ఆటో ఎక్స్‌పోలో ధరలు వెల్లడిస్తారు. ఫిబ్రవరి 2025 లో డెలివరీలు ప్రారంభమవుతాయని హోండా ప్రకటించింది.
హోండా ఆక్టివా ఇ మోడల్ లో రిమూవబుల్ బ్యాటరీ ఇస్తున్నారు. ఈ స్కూటర్లు ఐదు రంగుల్లో లభిస్తాయి. ఈ స్కూటర్లలో 7.0 అంగుళాల TFT డిస్ప్లే ఉంది. Honda RoadSync Duo యాప్ తో వస్తుంది. ఆక్టివా ఇ హోండా మొబైల్ పవర్ ప్యాక్ తో వస్తుంది. ఇందులో రెండు 1.5 kWh బ్యాటరీలు ఉన్నాయి. అందువల్ల ఈ స్కూటర్లు 102 కి.మీ. రేంజ్ వరకు ఆగకుండా పరుగులు తీస్తాయి.
హోండా QC1 మోడల్ విషయానికొస్తే ఈ స్కూటర్ అధునాతన సాంకేతికతతో వస్తోంది. ఆక్టివా ఇ లాగానే ఇది ఐదు రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ స్కూటర్ లో 1.5 kWh బ్యాటరీ మాత్రమే ఉంది. అందుకే ఇది 80 కి.మీ. రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ 4 గంటల 30 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.
ఆక్టివా ఇ లాంచ్ అప్డేట్స్
ఈ స్కూటర్ 1.8 kW మోటార్ తో, 77 Nm టార్క్ తో 50 km/h వేగంతో వెళ్తుంది. 5.0 అంగుళాల LCD డిస్ప్లే, USB టైప్-C అవుట్‌లెట్, 26 లీటర్ స్టోరేజ్ తో వస్తుంది. 3 సంవత్సరాలకు 50,000 కి.మీ. తిరగడానికి కంపెనీ వారంటీ ఇస్తోంది. ఈ స్కూటర్ మీరు కొంటే మొదటి సంవత్సరంలో మూడు ఉచిత సర్వీసులు పొందవచ్చు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉచితంగా లభిస్తుంది.