Low Budget Phones: రూ.10,000లోపు వచ్చే అద్భుతమైన 5G ఫోన్లు ఇవిగో

Published : Dec 18, 2025, 10:59 AM IST

Low Budget Phones: కొత్త మొబైల్ కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ మేము రూ.10,000 ధరలో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను ఇక్కడ ఇచ్చాము. POCO M7 5G, Samsung Galaxy M06, Moto G06 Power ఫోన్ల గురించి ఇక్కడ ఇచ్చాము. 

PREV
15
బెస్ట్ 5జి ఫోన్లు

పదివేల రూపాయల లోపు బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇక్కడ మేము  POCO M7 5G, Samsung Galaxy M06 5G, Moto G06 Power అనే మూడు కొత్త మోడళ్లు మార్కెట్లో ఉన్నాయి.  మీకు ఇవి అన్నిరకాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఫోన్ల ఫీచర్లు తెలుసుకుంటే మీకు నచ్చిన ఫోనును ఎంపిక చేసుకుని కొనవచ్చు. 

25
POCO M7 5G

ఈ ఫోన్ ధర రూ.9000 ఉంటుంది. తక్కువ ధరకు వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. 2025లో వచ్చిన మోడల్ POCO M7 5G. దీనిలో 6.88 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. వీడియోలు, గేమింగ్‌కు ఇది చాలా బాగుంటుంది.  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్‌తో సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌కు అనుకూలంగా ఉండే ఫోన్ ఇది. ఇక కెమెరా విషయానికి వస్తే 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో స్పష్టమైన ఫోటోలు తీయొచ్చు.  బ్యాటరీ 5,160mAh పవర్ తో రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడొచ్చు.

35
Samsung Galaxy M06 5G

శాంసంగ్ సంస్థ అంటేనే  వినియోగదారులకు ఎంతో నమ్మకం. దీని ఖరీదు రూ.9,999.  సాఫ్ట్‌వేర్ క్వాలిటీ, ఎక్కువ కాలం మన్నిక కోరుకునేవారికి Samsung Galaxy M06 5G బెస్ట్ ఛాయిస్. ఇది 6.7 అంగుళాల LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6300 ప్రాసెసర్, 4GB RAMతో వేగంగా పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే  50MP వెనుక కెమెరా + 2MP కెమెరా, ముందు 8MP కెమెరా ఉన్నాయి.

45
Moto G06 Power

దీని ధర 7,999 రూపాయలు మాత్రమే. తక్కువ బడ్జెట్ ఫోను అయితే చక్కగా పనిచేస్తుంది.  పేరుకు తగ్గట్టే ఇది నిజమైన 'పవర్' హౌస్.  Moto G06 Power ప్రత్యేకత దాని 7,000mAh భారీ బ్యాటరీ. ఛార్జింగ్ అయిపోతుందనే చింత లేకుండా రెండు రోజుల వరకు వాడొచ్చు.  50MP డ్యూయల్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

55
ఏది కొనడం తెలివైన పని?

• మీరు గేమింగ్, హై-స్పీడ్ 5G అనుభవం కోరుకుంటే, POCO M7 5G ఎంచుకోవచ్చు.

• ఎక్కువ కాలం పనిచేసే నమ్మకమైన బ్రాండ్, మంచి సాఫ్ట్‌వేర్ అనుభవం కావాలంటే Samsung Galaxy M06 5G ఉత్తమం.

• ఛార్జింగ్ నిలిస్తే చాలు, బ్యాటరీనే ముఖ్యం అనుకునేవారికి Moto G06 Power సరైన ఎంపిక.

Read more Photos on
click me!

Recommended Stories