పాప్ కార్న్ పైనా ట్యాక్స్... ఎంతో తెలుసా? : జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయాలు

First Published | Dec 21, 2024, 2:59 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జైసల్మేర్ లో జరుగుతోంది. ఇందులో తీసుకునే నిర్ణయాలు సామాన్యుల జీవితాలపై  ప్రభావం చూపనున్నాయి. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలుసా? 

GST Council Meeting

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన GST (జిఎస్టి) కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ 55వ గూడ్స్ ఆండ్ సర్విస్ టాక్స్ (వస్తు సేవల పన్ను) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యూజ్డ్ పాత కార్ల (ఎలక్ట్రిక్ కూడా) అమ్మకంపై జిఎస్టిని పెంచింది. ఇలా ట్యాక్సులకు సంబంధించిన అనేక విషయాలపై జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తున్నారు. 

GST Council Meeting

జిఎస్టి కౌన్సిల్ కీలక నిర్ణయాలు : 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. ఈ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. అయితే ఇందులో చర్చించి తీసుకున్న నిర్ణయాలు బయటకు వచ్చాయి.

మనం సరదాగా తినే పాప్ కార్న్ పై కూడా ట్యాక్స్ విధించారు.  సాల్ట్ లేదా మసాలా పాప్ కార్న్ ప్యాక్ చేయకుండా అమ్మితే దానిపై 5 శాతం, ప్యాక్ చేసి అమ్మితే 12 శాతం, షుగర్ కలిపిన పాప్ కార్న్ అయితే 18 శాతం జిఎస్టి విధించారు.  

ఇక పోర్టిఫైడ్ రైస్ పై ట్యాక్ ను తగ్గించారు. ఇప్పటివరకు వీటిపై 18 శాతంగా వున్న జిఎస్టిని 5 శాతానికి తగ్గించనున్నారు.

ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (AAC) బ్లాక్స్ లో 50 శాతం కంటే ఎక్కవ ప్లై యాష్ వుంటే 12 శాతం జిఎస్టి వుండనుంది.
 


GST Council Meeting

జిఎస్టి కౌన్సిల్ లో చర్చిస్తున్న అంశాలివే : 

నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో మొత్తం 148 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందులోని అనేక అంశాలపై చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. మిగతా అంశాలపైనా ఓ నిర్ణయానికి వచ్చాక వీటన్నింటిని సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. 

అయితే జిఎస్టి కౌన్సిల్ భీమా రంగంపై ట్యాక్సులు తగ్గించి, లగ్జరీ ఉత్పత్తులపై ట్యాక్సులు పెంచే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇలా జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో కీలక మైన నిర్ణయాలు తీసుకోనున్నారు. 

Latest Videos

click me!