2024లో ఇండియాలో టాప్ 10‌ కుబేరులు వీళ్లే

First Published | Dec 21, 2024, 12:14 PM IST

Year Ender 2024: 2024 ఎంతో మందిని ధనవంతులను చేసింది. ఇప్పటికే కోటీశ్వరులైన వారిని కుబేరులుగానూ మార్చింది. ఇండియాలో 2024లో టాప్ 10 లో ఉన్న ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ వెల్లడించింది. వారెవరో తెలుసుకుందాం రండి. 

10. బజాజ్ కుటుంబం 23.4 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో 10వ అత్యంత ధనిక కుటుంబంగా నిలిచింది. 

9. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పునావల్లా 24.5 బిలియన్ డాలర్ల నికర విలువతో దేశంలోనే తొమ్మిదర ధనవంతుడిగా నిలిచారు.

8. కుమార్ బిర్లా 24.8 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలో 2024లో ఎనిమిదో ధనవంతుడిగా నిలిచారు. ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్ కు ఛైర్మన్ గా ఉన్నాయి. అంతేకాకుండా ప్రఖ్యాత బిర్లా కుటుంబానికి చెందిన వ్యక్తిగా సొసైటీలో గుర్తింపు పొందారు. 

7.భారతీ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన సునీల్ మిట్టల్ ఈ ఏడాది 30.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఏడో స్థానంలో ఉన్నారు. 


6. బిలియనీర్ పెట్టుబడిదారుడు, వ్యవస్థాపకుడు అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ ఫౌండర్ అయిన రాధాకిషన్ దమానీ భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో 6వ వ్యక్తిగా నిలిచారు. ఆయన ఆదాయం నికర విలువ 31.5 బిలియన్ డాలర్లు. 

5. సన్ ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అయిన దిలీప్ సంఘ్వీ టాప్ 10 జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆదాయం విలువ 2019లో 19 బిలియన్ల డాలర్లు ఉండగా ఇప్పుడు 32.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ రేంజ్ లో పెరగడం అంటే ఆయన వ్యాపారాలు ఎంత సక్సెస్ పుల్ గా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

4. హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ ఇండియాలోని టాప్ 10 రిచ్చస్ట్ మ్యాన్ లిస్టిన 4వ స్థానంలో ఉన్నారు. దానగుణంలో ఆయనన్ను మించిన వారు లేరంటే ఆశ్చర్య పడక్కరలేదు. రోజుకు కొన్ని రూ.కోట్లు దానంగా పంచుతూ ఆయన ఎంతో పేరు సంపాదించారు. 

3.  ఓపీ జిందాల్ గ్రూపునకు చెందిన సావిత్రి జిందాల్ 2024లో 43.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో 3వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 లిస్టులో ఉన్న ఏకైక మహిళ ఆవిడే కావడం ఇక్కడ విశేషం.

2. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద 116 బిలియన్ డాలరు. ఈ ఏడాది ఆయన ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన ఆదాయంలో పెద్దగా తేడాలు రాకపోవడం విశేషం.

1. ఇక 2024లో ఇండియాలో అత్యంత రిచ్ఛస్ట్ మ్యాన్ ఎవరనుకుంటున్నారు. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన నికర ఆదాయం విలువ 119.5 బిలియన్ డాలర్లు.

Latest Videos

click me!