అదానీ గ్రూప్ చేతికి మరో ఎయిర్ పోర్టు.. జీవీకే నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన..

Ashok Kumar   | Asianet News
Published : Jul 14, 2021, 12:23 PM IST

బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయా నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు జివికె గ్రూప్ నుండి స్వాధీనం చేసుకుని దేశంలో అతిపెద్ద విమానాశ్రయ మౌలిక సదుపాయాల సంస్థగా అవతరించింది. 

PREV
14
అదానీ గ్రూప్ చేతికి మరో ఎయిర్ పోర్టు.. జీవీకే నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన..

అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ - మల్టీ నేషనల్ కాంగ్లోమరేట్  అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్  పూర్తి యాజమాన్యంలోని సంస్థ. దేశీయ ఎయిర్ పోర్టు రంగంలో అదానీ గ్రూప్ వాటా 25 శాతానికి చేరింది.  అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ ఇండియన్ ఎయిర్ కార్గోలో 33శాతం మార్కెట్ వాటానూ సొంతం చేసుకుంది.

24

ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ బోర్డు సమావేశం తరువాత కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే మహారాష్ట్రలోని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నుండి వచ్చిన ఆమోదాలను అనుసరిస్తున్నట్లు అదానీ గ్రూప్  వెల్లడించిన ఒక ప్రకటనలో తెలిపింది.అదానీ గ్రూప్ వచ్చే నెలలో నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రారంభించి రాబోయే 90 రోజుల్లో  పూర్తి చేస్తుంది అలాగే 2024లో విమానాశ్రయం ప్రారంభించనుంది.

34

జీవీకే గ్రూప్ నుంచి యాజమాన్య బాధ్యతలు అదానీ గ్రూప్‌నకు మారడంపై గౌతమ్ అదానీ ప్రకటన చేశారు. మా విమానాశ్రయ విస్తరణ వ్యూహం మన దేశం  టైర్ 1 నగరాలను టైర్ 2 అండ్ టైర్ 3 నగరాలతో హబ్ గా మార్చడానికి సహాయపడుతుంది.  ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రక్రియలో వేలాది స్థానికులకు కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నామని, పోర్టును మరింతగా విస్తరించేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు.
 
44

2020లో లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాల కార్యకలాపాలను చేపట్టిన అదానీ ఐపోర్ట్ హోల్డింగ్స్ నెక్స్ట్ జనరేషన్  ఏవియేషన్ లింకేడ్ బిజినెస్  అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా  టెండర్ల ప్రక్రియ ద్వారా లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, గౌహతి, జైపూర్, తిరువనంతపురంతో మొత్తం 6 విమానాశ్రయాలను 50 సంవత్సరాల పాటు నిర్వహించడానికి, ఆధునీకరించడానికి  ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

click me!

Recommended Stories