దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10 గ్రాముల పసిడి ధర ఎంత తగ్గిందంటే ?

First Published Jun 24, 2021, 11:00 AM IST

అంతర్జాతీయ మార్కెట్ల ధరల నేపథ్యంలో భారతదేశంలో గురువారం బంగారం ధరలు పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ గ్రాముకు రూ .162 అంటే 0.34 శాతం తగ్గి రూ .46,910 వద్ద ట్రేడవుతోంది. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .47,072 వద్ద ముగిసింది.
 

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజిలో వెండి ధర కిలోకు రూ .372 అంటే 0.55 శాతం తగ్గింది. దీంతో వెండి ధర సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోకు రూ .67,932 నుండి రూ .67,560 దిగోచ్చింది.ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్సుకు 0.1 శాతం తగ్గి 1,777.26 డాలర్లకు చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 1,779.50 డాలర్లకు చేరుకుంది. డాలర్ సూచీ 11 వారాల గరిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంది.
undefined
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,340గా ఉంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరుగుదలతో రూ.44,550 చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెంపుతో రూ.48,600 ఉంది. హైదరాబాద్ లో 10గ్రాముల బంగారం ధర రూ.48,690 ఉండగా, వెండి ధర కిలోకు రూ.73,100గా ఉంది.
undefined
కోలకతా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 390 పెరుగుదలతో రూ.46,660 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెంపుతో రూ.49,200 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉంది.
undefined
వెండి ధరలుఢిల్లీలో కిలోకు రూ.67,900చెన్నైలో కిలోకు రూ.73,400కోలకతాలో కిలోకు రూ.67,900ముంబైలో కిలోకు రూ.67,900
undefined
click me!