Business Ideas: మహిళలు ఇంటివద్ద ఉండే నెలకు రూ. 1 లక్ష సంపాదించే ఈజీ బిజినెస్ ఇదే..

First Published | Aug 15, 2023, 5:18 PM IST

మహిళలు ఇంటి వద్ద ఉండి చక్కటి వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఉద్యోగం చేయడం కన్నా కూడా సొంత వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి చక్కటి బిజినెస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు సంవత్సరం మొత్తం చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

business Idea

భారతీయ వంటల్లో సాధారణంగా ఎక్కువగా ఉపయోగించేది గరం మసాలా. వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల వంటల్లోను గరం మసాల పొడిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. సాధారణ ఇళ్ళతో సహా హోటల్స్, కర్రీ పాయింట్స్, కేటరింగ్ సర్వీసులు  అందించే వారందరూ కూడా  గరం మసాల ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే మార్కెట్లో గరం మసాలకు మంచి డిమాండ్ ఉంది. మీరు గరం మసాలా  తయారీ వ్యాపారం చేయడం ద్వారా చక్కటి  ఆదాయం పొందే అవకాశం ఉంది.  అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం

గరం మసాలా తయారీకి వివిధ రకాల మసాలా  దినుసులు అవసరం వీటిలో ప్రధానంగా ధనియాలు,  ఏలకులు,  మిరియాలు,  మెంతి పొడి,  జీలకర్ర, షాజీరా,  లవంగాలు,  జాజికాయ జాపత్రి వంటి అనేక సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటారు. వీటిని సమపాళ్లల్లో ఒక ఫార్ములా ప్రకారం పొడిచేసి గరం మసాలా పొడిని తయారు చేస్తూ ఉంటారు. 
 


ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు గరం మసాలా పొడులను విక్రయిస్తున్నాయి. ఆయా బ్రాండ్ల పేరిట గరం మసాలా పొడులను విక్రయిస్తున్నారు. గరం మసాలా వ్యాపారంలో కొన్ని కంపెనీలు వందల కోట్ల వ్యాపారం కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ మసాలాపొడులకు  డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే భారతీయ వంటల్లో అన్నిట్లోనూ  గరం మసాల వాడకం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గరం మసాలా వ్యాపారం ఒక లాభసాటి వ్యాపారంగా మారే అవకాశం ఉంది. 
 

మీరు గనుక గరం మసాలా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, మీ ఇంట్లోనే ప్రారంభించవచ్చు.  ప్రస్తుతం మార్కెట్లో లభించే  పిండి మిల్లు మిషిన్ కొనుగోలు చేయడం ద్వారా ఈ మసాలా వ్యాపారం ప్రారంభించవచ్చు.  అలాగే ప్యాకేజింగ్ కోసం కూడా ప్రత్యేకంగా మిషన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.  ప్రారంభంలో  పెట్టుబడి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుంది.  అనంతరం మీరు మీ వ్యాపారం పెరిగే  యూనిట్ పరిమాణం పెంచుకోవాల్సి ఉంటుంది. 

ఇక మార్కెటింగ్ కోసం మీరు కిరాణా దుకాణాలు,  హోల్ సేల్ షాపులు, కర్రీ పాయింట్స్.  హాస్టల్స్,  హోటల్స్,   రెస్టారెంట్లు వంటి చోట్ల మీరు గరం మసాలా ఆర్డర్లను పొంది విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది అంతే కాదు రెగ్యులర్ గా ఆర్డర్లను పొందవచ్చు. 

ఈ వ్యాపారాన్ని మీరు ఇంటి వద్ద కూడా ప్రారంభించవచ్చు.  ఒకవేళ మీరు పెద్ద ఎత్తున ప్రారంభించాలి అనుకుంటే ఒక తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.  ఇందుకోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 
 

Latest Videos

click me!