Gold Price Hike: కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు..ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో భారీగా తగ్గిన పసిడి బుధవారం తిరిగి పెరిగింది. సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
బంగారం కొనాలని చూస్తున్నవారికి ఈరోజు బిగ్ షాక్ అనే చెప్పాలి. రెండు రోజులుగా తగ్గుతూ ఊరట కల్పించిన పసిడి...ఇవాళ కొంపముంచింది. వరుసగా తగ్గిన బంగారం ధరలు..ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి రేటు రూ.1,37,100కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములకు రూ.770 పెరగడంతో.. ధర రూ.1,49,570కు చేరింది.
ఇక వెండి విషయానికి వస్తే.. సెప్టెంబర్ 30న రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2.40 లక్షలుగా ఉంది.
24
బంగారానికి కలిసి రావొచ్చు
రానున్న రోజుల్లో బంగారం ధరలపై అంతర్జాతీయ నిపుణుల అంచనాలు ఆసక్తిని పెంచుతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, డాలర్ బలహీనపడే అవకాశం, బాండ్ యీల్డ్స్‌లో మార్పులు వంటి అంశాలు పసిడికి అనుకూలంగా మారొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మరోవైపు..బంగారం ధరలు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయికి చేరుకున్నాయి. అయితే రాబోయే ఆరు నుంచి 12 నెలల్లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల నుంచి బంగారం కొనుగోళ్లు పెరగడం పసిడికి కీలకంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు చూడటం కూడా బంగారానికి కలిసొచ్చే అంశంగా మారవచ్చు.
34
ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి
అయితే మరోవైపు చమురు ధరలు కూడా కీలకంగా మారుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగితే.. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భారత్ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాల మార్కెట్లపై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ, టెక్నాలజీ వంటి రంగాల వైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకవైపు బంగారం ధరలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ సంస్థల నుంచి మరింత పెరుగుదలపై అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే బంగారం ధర పెరుగుతుందని ఒక్కసారిగా భారీగా పెట్టుబడి పెట్టడం కంటే.. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలు రోజురోజుకూ మారే అవకాశం ఉన్నందున.. కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం