బంగారం కొంటున్నారా అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే బంగారం ధర భారీగా పతనం అయ్యే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధర విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర శుక్రవారం రూ.420 తగ్గి 10 గ్రాములకు రూ.60,380కి చేరుకుంది. గురువారం 10 గ్రాముల పసిడి ధర రూ.60,800 వద్ద ముగిసింది. అయితే, అందుకు విరుద్ధంగా వెండి ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.73,300కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు (31 గ్రాములు) బంగారం ధర 1,945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధర 23.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తుందన్న అంచనాలతో యుఎస్ బాండ్ రాబడి పెరగుతుందనే వార్తలు బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మే నెలలో బంగారం ధర అంతర్జాతీయంగా గమనించినట్లయితే అత్యధిక స్థాయిలో ఉంది. మే 10వ తేదీన బంగారం ధర అంతర్జాతీయంగా గరిష్టంగా 2030 డాలర్ల స్థాయిని దాటింది. అక్కడి నుంచి సరిగ్గా నెల రోజుల తర్వాత మనం గమనించినట్లయితే 90 డాలర్లు తగ్గి ప్రస్తుతం 1940 డాలర్ల వద్ద బంగారం ధర ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా గమనించినట్లయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడానికి అమెరికాలో తలెత్తినటువంటి రుణ సంక్షోభం పరిష్కారం అవటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. గత నెల 31వ తేదీన అమెరికాలోని కాంగ్రెస్ సభ బైడెన్ ప్రభుత్వం, రుణ పరిమితిని పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది ఈ నేపథ్యంలో అమెరికన్ ఆర్థిక పరిస్థితి దివాలా తీయకుండా బయటపడింది. దీంతో అమెరికా జారీ చేసిన బాండ్స్ కు మళ్లీ డిమాండ్ పెరిగింది అలాగే స్టాక్ మార్కెట్ కూడా పొందుతుంది దీంతో బంగారం పై పెట్టుబడి పెట్టిన వారంతా మళ్లీ యూఎస్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ సైతం వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టే వారి ఆసక్తి తగ్గుతోంది. దీంతో పాటు డాలర్ కూడా పుంజుకుంటుంది ఈ ప్రభావం కూడా బంగారంపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 60 వేల పైన ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్న దృష్ట్యా త్వరలోనే బంగారం ధర 60 వేల దిగువకు వచ్చే అవకాశం ఉంది. ట్రెండు ఇలాగే కొనసాగితే బంగారం ధర మళ్ళీ 55 వేల రూపాయలకు దిగివచ్చే అవకాశం కనిపిస్తోంది.