దిగొచ్చిన బంగారం, వెండి.. కొనేవారికి మంచి ఛాన్స్.. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఎంత తగ్గిందంటే..?

First Published | Nov 24, 2023, 11:30 AM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. పెళ్లిళ్లు,శుభకార్యాల సమయం వచ్చేసింది, దింతో బంగారం, వెండి కొనేందుకు మహిళలు, ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒకరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ షాకిస్తున్న ధరలు ఇవాళ కాస్త  కొనుగోలుదారులకు ఉరటనిచ్చాయి. 
 

నేడు 24 నవంబర్ న దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 50 పతనంతో  రూ. 56,950,  24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 120 పతనంతో  రూ. 62,120. రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ.76,200.

చెన్నైలో  24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకి రూ.62550, వెండి ధర 1కిలోకి రూ.72899 ఉంది.

ముంబైలో  24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకి రూ.61970, వెండి ధర 1కిలోకి రూ.72899 ఉంది.

కోల్‌కతాలో   24 క్యారెట్ల బంగారం ధర  10గ్రాములకి రూ.61970, వెండి ధర  1కిలోకి  రూ.72899 ఉంది.
 

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.56,800 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.56,800 వద్ద ఉంది.

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,970.

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350గా ఉంది.  
 


0123 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.1 శాతం పెరిగి ఔన్సుకు $1,993.96 వద్ద ఉంది. ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 0.7 శాతం పెరిగింది. US గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం పెరిగి $1,994.70 వద్ద ఉన్నాయి.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 23.69 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 915.43 డాలర్ల వద్ద స్థిరపడింది. పల్లాడియం ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 1,047.28 డాలర్లకు చేరుకుంది.

విజయవాడలో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 50 పతనంతో రూ. 56,800, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 50 పతనంతో  రూ. 61,970. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర  కిలోకు రూ.79,200.

విశాఖపట్నంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 50 పతనంతో రూ. 56,800  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 50 పతనంతో రూ. 61,970. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 79,200.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 50  పతనంతో రూ. 56,800 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 50 పతనంతో రూ. 61,970. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.79,200.

 ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి,   ఎప్పుడైనా ధరలు మారవచ్చు అలాగే  అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

Latest Videos

click me!