ఇంధన ధరలు తగ్గేనా.. పెట్రోల్, డీజిల్ నేటి కొత్త ధరలు ఇవే.. లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

First Published | Nov 24, 2023, 9:32 AM IST

పెట్రోల్ డీజిల్ ధరలను జాతీయ ఆయిల్  కంపెనీలు ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తాయి. ఈరోజు అంటే 24 నవంబర్ 2023న తాజా అప్‌డేట్ ప్రకారం, జాతీయ స్థాయిలో పెట్రోల్  డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, రాష్ట్రాల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. క్రూడాయిల్  గురించి చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ  వంటి మెట్రో నగరాలతో సహా  పరిసర ప్రాంతాల్లో ఈ రోజు పెట్రోల్  డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం...
 

దేశ రాజధాని ఢిల్లీలో నేటికీ లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గానూ, లీటర్ డీజిల్ ధర రూ.89.62గానూ కొనసాగుతున్నట్లు ఐఓసీఎల్ వెల్లడించింది. దీనితో పాటు, దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడితే, ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 106.31, డీజిల్ లీటరుకు రూ. 94.27 వద్ద స్థిరంగా ఉంది. దీంతో పాటు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా కొనసాగుతోంది.  కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76 .
 

పెట్రోల్ ధరలు 
బెంగళూరు: లీటరుకు రూ. 101.94 
పాట్నా: లీటరుకు రూ. 107.24 
గురుగ్రామ్: లీటరుకు రూ. 97.18 
కేరళ: లీటరుకు రూ. 117.17 
జైపూర్: లీటరుకు రూ. 108.73 
లక్నో: లీటరు రూ.96.57 
తిరువనంతపురం: లీటరుకు రూ.108.58 
పోర్ట్ బ్లెయిర్: లీటరుకు రూ. 84.10
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.109.66, 


డీజిల్ ధరలు
బెంగళూరు: లీటరుకు రూ. 87.89 
పాట్నా: లీటరుకు రూ. 94.04 
గురుగ్రామ్: లీటరుకు రూ. 90.05 
కేరళ: డీజిల్ లీటరుకు రూ. 103.93 
జైపూర్: లీటరుకు రూ. 95.03 
లక్నో: లీటరు రూ.89.76 
తిరువనంతపురం: లీటరుకు రూ.97.45 
పోర్ట్ బ్లెయిర్: లీటరుకు రూ. 79.74 
గురుగ్రామ్: లీటరుకు రూ. 89.96
హైదరాబాద్ డీజిల్ లీటరు ధర  రూ.97.82గా ఉంది.

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.
 

ప్రతి నగరంలో పెట్రోల్ ధరలు మారడానికి కారణం పన్ను. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలలో వివిధ రేట్లలో పన్నులు వసూలు చేస్తాయి. మునిసిపల్ కార్పొరేషన్లు,  మునిసిపాలిటీలు కూడా ఒక్కో నగరానికి అనుగుణంగా పన్నులు ఉంటాయి. ఇవి నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి, వీటిని స్థానిక సంస్థల పన్ను అని కూడా పిలుస్తారు. ఒక్కో మునిసిపల్ కార్పొరేషన్ ఆధారంగా వేర్వేరు పన్నులు కూడా విధించబడతాయి.

Latest Videos

click me!