EPFO న్యూ రూల్స్: మూడు రోజుల్లోనే చేతిలోకి PF డబ్బులు
పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం చాలా కష్టం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇక నుంచి మాత్రం.. ఇది చాలా సులభం. EPFO తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఓసారి చూద్దామా..
పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం చాలా కష్టం అనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇక నుంచి మాత్రం.. ఇది చాలా సులభం. EPFO తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఓసారి చూద్దామా..
EPFO అనేది ఉద్యోగుల భవిష్య నిధి. ఇది ఉద్యోగులకు పెన్షన్, సహాయం అందిస్తుంది. అయితే... ప్రతినెలా తమ జీతం నుంచి కట్ అయ్యి.. పీఎఫ్ ఎకౌంట్ లోకి చేరే నిధిని అవసరానికి తీసుకోవడం చాలా కష్టమైన పనిగా చాలా మంది భావించేవారు. ఆ డబ్బు కోసం క్లెయిమ్ చేసిన చాలా రోజుల తర్వాతకు కానీ.. ఆ డబ్బులు చేతికి అందేవి కావు. కానీ.. ఇప్పుడు రూల్ మారింది. ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే ఆ డబ్బులు మీ చేతిలోకి వస్తాయి.
రూ.1 లక్ష వరకు క్లెయిమ్స్
ప్రస్తుతం 60% వరకు క్లెయిమ్స్ ఆటోమేటిక్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఈ మార్పుల తర్వాత రూ.1 లక్ష వరకు క్లెయిమ్స్ 3 రోజుల్లో జరుగుతాయి. ఆరోగ్యం, వైద్య ఖర్చులు, ఇల్లు, చదువు, పెళ్లి లాంటి క్లెయిమ్స్ త్వరగా క్లియర్ అవుతాయి.
పేరు, పాస్ బుక్ వివరాలు మార్చడం సులువు
ఆధార్ తో లింక్ అయిన UAN ఉన్నవాళ్లు, EPFO ఆఫీస్ కు వెళ్లకుండా ఆన్ లైన్ లో పేరు మార్చవచ్చు. ప్రస్తుతం 96% మార్పులు EPFO ఆఫీస్ లేకుండానే జరుగుతున్నాయి.
PF ట్రాన్స్ఫర్ సులువు
ఆధార్ తో లింక్ అయిన UAN ఉంటే, కొత్త కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు PF-ని మార్చడం సులువు. 90% ట్రాన్స్ఫర్లు పర్మిషన్ లేకుండానే జరుగుతాయి.
చెక్-లీఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు
క్లెయిమ్ చేసేటప్పుడు, అకౌంట్ కన్ఫర్మ్ చేయడానికి చెక్ లీఫ్ లేదా పాస్ బుక్ ఇవ్వాలి. KYC అప్డేట్ చేసినవాళ్లు ఇవేమీ లేకుండా క్లెయిమ్ చేయవచ్చు.
తగిన అర్హత లేని క్లెయిమ్స్
EPFO మెంబర్స్ క్లెయిమ్ చేసే ముందు అర్హత ఉందా? అని ముందుగానే తెలుసుకోవచ్చు. దీని వల్ల రిజెక్ట్ అయ్యే క్లెయిమ్స్ సంఖ్య తగ్గుతుంది.
99% క్లెయిమ్స్ ఆన్ లైన్ లో
ఇప్పటి వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.14 కోట్ల క్లెయిమ్స్ ఆన్ లైన్ లో వచ్చాయి. ఇక ఫీల్డ్ ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.
UPI ద్వారా EPF చెల్లించడం
UPI ద్వారా EPF క్లెయిమ్ పేమెంట్స్ ఇవ్వడానికి NPCI తో మాట్లాడుతున్నారు. కుదిరితే డిజిటల్ వాలెట్స్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.
EPFO యొక్క ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 (రేపటి) నుంచి అమలులోకి రానున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు EPFO యొక్క అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.