EPFO అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. ఇది ఉద్యోగులకు పింఛను, సాయం అందించడానికి ఏర్పాటైంది. ఈ వ్యవస్థలో క్లెయిమ్‌లు అంటే ఉద్యోగులు తమ PF డబ్బులు తీసుకోవడం సులభంగా చేయడానికి కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. కొత్త మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.1 లక్ష వరకూ క్లెయిమ్‌లు
ప్రస్తుతం 60 % వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతున్నాయి. ఈ మార్పుల తర్వాత రూ.1 లక్ష వరకూ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా మూడు రోజుల్లో ప్రాసెస్ అవుతాయి.
అనారోగ్యం, ఆసుపత్రి ఖర్చులు, ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, వివాహం కోసం క్లెయిమ్‌లను త్వరగా క్లియర్ చేస్తారు.
పేరు, పాస్‌బుక్ డిటైల్ మార్పులు సింపుల్
ఆధార్‌తో లింక్ అయిన UAN నంబర్ ఉన్నవారు, EPFO కార్యాలయానికి వెళ్లకుండా ఆన్లైన్‌లోనే పేరును లేదా ఇతర వివరాలను సరిచేసుకోవచ్చు. ప్రస్తుతం 96% మార్పులు EPFO కార్యాలయ జోక్యం లేకుండానే పూర్తవుతున్నాయి.
PF బదిలీ సులభతరం
ఆధార్‌తో లింక్ అయిన UAN ఉంటే, కొత్త కంపెనీకి జాయిన్ అయినప్పుడు పాత PFను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఇకపై సులభం. ముందు కంపెనీ యాజమాన్యం అనుమతి అవసరం ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 90% ట్రాన్స్‌ఫర్‌లు యాజమాన్యం అనుమతి లేకుండానే పూర్తవుతాయి.
చెక్-లీఫ్ సమర్పించాల్సిన అవసరం లేదు
క్లెయిమ్ చేసేటప్పుడు, ఖాతా నిర్ధారణ కోసం ముందుగా చెక్ లీఫ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ కాపీ అందించాల్సి ఉండేది. ఇప్పుడు, KYC అప్‌డేట్ చేసిన వారు ఈ ప్రక్రియ లేకుండానే క్లెయిమ్ చేసుకోవచ్చు.
అనర్హమైన క్లెయిమ్‌లపై గైడ్‌లైన్స్
EPFO సభ్యులు క్లెయిమ్ చేసేముందు తమ క్లెయిమ్ అర్హత ఉందా లేదా అని ముందుగా తెలుసుకోవచ్చు. దీనివల్ల రిజక్ట్ అయ్యే క్లెయిమ్‌ల సంఖ్య తగ్గుతుంది.
క్లెయిమ్‌ల 99% ఆన్లైన్‌లోనే..
ఇప్పటి వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.14 కోట్ల క్లెయిమ్‌లు ఆన్లైన్‌లో దాఖలయ్యాయి. ఇకపై ఫీల్డ్ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
UPI ద్వారా EPF చెల్లింపులు
భవిష్యత్తులో UPI ద్వారా EPF క్లెయిమ్ పేమెంట్స్ అందించేందుకు NPCIతో చర్చలు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే క్లెయిమ్ చేసే డబ్బులు డిజిటల్ వాలెట్ల ద్వారా తీసుకోవచ్చు.