కారు కొనుక్కోవడం చాలా మందికి ఓ డ్రీమ్. కొంత మంది చిన్ననాటి నుంచి ఓ లక్ష్యంగా పెట్టుకుని ఎలాగైనా కారు కొనాలని ప్రత్యేకంగా సేవింగ్స్ కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీరో డౌన్ పేమెంట్ తో కూడా కార్లు కొనుక్కోండని కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంటాయి. వీటిని చూసి టెంప్ట్ కాకుండా ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా కారు కొనుక్కోవాలనే లక్ష్యంతో ఉన్న వారు ఈ ఆఫర్లు చూసి వెంటనే కొనేయాలని తొందర పడుతుంటారు. కాని అలా తొందర పడితే అప్పులపాలైపోవడం ఖాయం.
సిటీస్ లో ఇప్పుడున్న ట్రాఫిక్ లో బైక్స్ పై వెళ్లడం అంత సేఫ్ కాదు. అనుకోని ప్రమాదం జరిగితే బైక్ నడిపేవారే ఎక్కువ గాయపడతారు. అయితే కారు అయితే వెహికల్ పాడవుతుంది. ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే సిటీస్ లో బైక్ కంటే కారే సేఫ్.
బర్డెన్ లేకుండా కారు కొనుక్కోవాలంటే మీరు 20-4-10 ఫార్ములా ఫాలో అవ్వండి. ఈ ఫార్ములాలో మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? ఎంత లోన్ తీసుకోవాలి? ఎంత ఖరీదైన కారు కొనాలి వంటి అనేక విషయాలు మీకు తెలుస్తాయి. అసలు 20-4-10 ఫార్ములా గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
20-4-10 ఫార్ములా లో 20 అంటే.. మీకు కొనాలనుకున్న కారు ధరలో 20 శాతం మీరు డౌన్ పేమెంట్ గా కట్టాలి. ఉదాహరణకు మీరు కొనాలనుకున్న కారు ధర రూ.10 లక్షలు ఉంటే రూ.2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలన్న మాట. కాని చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు 100 శాతం కారు ధరను లోన్ రూపంలో ఇస్తాయి. అంటే మీరేం డౌన్ పేమెంట్ కట్టకపోయినా మొత్తం లోన్ ఇస్తారు. కాని అలాంటి లోన్స్ తీసుకుంటే మీరు రిస్క్ లో పడతారు. అందువల్ల కారు కాస్ట్ రూ.10 లక్షలు అయితే మీరు కచ్చితంగా రూ.2 లక్షలు మీ సేవింగ్స్ నుంచే కట్టాలి. ఈ రూ.2 లక్షలు కూడా అప్పు చేయవద్దు.
20-4-10 ఫార్ములా లో 4 అంటే కారు లోన్ టెన్యూర్. అంటే మీరు తీసుకొని కారు లోన్ 4 సంవత్సరాల కంటే తక్కువే ఉండాలి కాని ఎక్కువ మాత్రం ఉండకూడదు. ఎక్కువ ఉంటే మీరే ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది.
20-4-10 ఫార్ములా లో 10 అంటే.. మీరు కట్టే ఈఎంఐ మీ సంపాదనలో 10 శాతం లేదా అంతకంటే తక్కువగా కేటాయించాలి. మీకొచ్చే ఆదాయంలో ఎక్కువ ఈఎంఐలకు వెళ్లిపోతే మీ డైలీ లైఫ్ రొటేషన్ కష్టంగా మారిపోతుంది. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక, కారు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల మీకు 20-4-10 ఫార్ములా ప్రకారం అన్ని అర్హతలు ఉంటేనే కారు కొనుక్కోవడానికి ముందుకు వెళ్లండి.