Gold rate: బడ్జెట్ తర్వాత మళ్లీ పెరిగిన బంగారం ధర..!

Published : Feb 04, 2025, 10:46 AM IST

భారత దేశంలో బంగారం రోజు రోజుకీ పెరిగిపోతోంది. బడ్జెట్ తర్వాత దీని ధర మళ్లీ పెరిగింది. కాస్త తగ్గిందిలే అని అనుకునేలోపు పెరిగిపోయింది. మరి, బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందామా...    

PREV
15
Gold rate: బడ్జెట్ తర్వాత  మళ్లీ పెరిగిన బంగారం ధర..!
Gold rate

బంగారం పై మక్కువ లేనివాళ్లు ఎవరు ఉన్నారు. మహిళల ఆభరణాలుగా మాత్రమే కాదు.. . ప్రాపర్టీగా కూడా బంగారాన్ని కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. బంగారంపై భారతీయులకు ఉన్న ఆసక్తి కారణంగా, కొనుగోళ్లు ఎక్కువగా ఉండటం వల్లే  రోజు రోజుకీ ఆ ధర పెరుగుతూ వస్తోంది. భారతీయులు పెళ్లిళ్లు, శుభకార్యాల సందర్భంగా కచ్చితంగా బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. మధ్యతరగతి వాళ్లకు మాత్రం ఈ బంగారం కొనడం కళగానే మిగిలిపోయేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఆ బడ్జెట్ తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. ఎంత పెరిగిందో తెలుసుకుందాం..

 

25
2025లో బంగారం ధర పెరుగుదల

2025 సంవత్సరం బంగారం ప్రియులకు షాక్ ఇచ్చే ఏడాదిగా మారింది. బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. నిన్న అమెరికా వాణిజ్యం ప్రారంభంలో బంగారం ధర పెరుగుదలలో ఉంది. దీని కారణంగా బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని అర్థమౌతోంది.

35
రూపాయి విలువ తగ్గుదల

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా నిన్న పడిపోయింది. దీనివల్ల రూపాయి విలువ తగ్గి, బంగారం దిగుమతి ధర పెరుగుతుంది. దీంతో దేశీయ బంగారం ధర కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే బంగారం ధర ఈరోజు పెరిగింది.

45
బడ్జెట్ తర్వాత ధర పెరుగుదల

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన శనివారం ఉదయం, సాయంత్రం రెండు సార్లు బంగారం ధర పెరిగింది. ఉదయం గ్రాముకు 105 రూపాయలు, పెరిగి 7,810 కి చేరుకుంది. అంటే.. పది గ్రాముల బంగారం రూ.78,100 కి చేరుకోవడం గమనార్హం. 

55
నేటి బంగారం ధర

ధర పెరుగుతుందని భావించిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా నిన్న బంగారం ధర తగ్గింది. బంగారం ధర తగ్గిందని అందరూ సంతోషించేలోగా.. మళ్లీ ఈ రోజు ఉదయానికి షాకిచ్చింది. ఈ రోజు ఉదయం మళ్లీ బంగారం పెరిగింది. 

ఈరోజు బంగారం ధర మళ్ళీ పెరిగింది. గ్రాముకు 105 రూపాయలు పెరిగి 7810 రూపాయలకు చేరుకుంది.

click me!

Recommended Stories