EPFO E-nominaton:ఇప్పుడు అలా చేయకపోతే మీరు మీ పి‌ఎఫ్ ఖాతా బ్యాలెన్స్, పాస్ బుక్ చూడలేరు..

Ashok Kumar   | Asianet News
Published : Jan 11, 2022, 11:50 AM IST

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు ఇ-నామినేషన్ (e-nomination)తప్పనిసరి చేసిన సంగతీ మీకు తెలిసిందే. ఇప్పుడు ఖాతాదారులు ఇ-నామినేషన్ లేకుండా మీ పి‌ఎఫ్ పాస్‌బుక్‌(PF passbook)ను చూడలేరు. అయితే ఇంతకుముందు ఇలా చేయాల్సిన అవసరం రాలేదు. 

PREV
15
EPFO E-nominaton:ఇప్పుడు అలా చేయకపోతే  మీరు మీ పి‌ఎఫ్ ఖాతా బ్యాలెన్స్, పాస్ బుక్ చూడలేరు..

కానీ, ఇప్పుడు పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ఈ-నామినేషన్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఖాతాదారులు ఇ-నామినేషన్ లేకుండా కూడా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించి పి‌ఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్‌ను సులభంగా చెక్ చేయవచ్చు.
 

25

ఈ‌పి‌ఎఫ్ ఖాతాలో ఇ-నామినేషన్ కోసం ముందుగా నామినీ పేరు ఇవ్వాలి. తరువాత అతని చిరునామా, ఖాతాదారులతో ఉన్న సంబంధాన్ని పేర్కొనవలసి ఉంటుంది. నామినీ పుట్టిన తేదీతో పాటు పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులో ఎంత శాతం అతనికి ఇవ్వాల్సి ఉంటుందో కూడా చెప్పాలి. నామినీ మైనర్ అయితే అతని/ఆమె సంరక్షకుని పేరు, చిరునామా ఇవ్వాలి. అలాగే నామినీ సంతకం లేదా వెలి ముద్ర తప్పనిసరి.

35

కాబట్టి ఏదైనా సేవింగ్స్ ప్లాన్ ఖాతా విషయంలో నామినేషన్ తప్పనిసరి. ఒకవేళ పి‌ఎఫ్ ఖాతాదారుడు అనుకోకుండా మరణిస్తే అతని చెందాల్సిన మొత్తం నామినేషన్ వ్యక్తికి డబ్బు చేరుతుంది. ఈ‌పి‌ఎఫ్ అండ్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా నామినేషన్ తప్పక చెయ్యాలి, తద్వారా ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​సభ్యుడి మరణం తర్వాత, నామినీకి సకాలంలో ఈ ఫండ్ లభిస్తుంది.

45

ఇ-నామినేషన్ ఇలా చేయవచ్చు
1.మొదట మీ యూ‌ఏ‌ఎన్ (UAN) అండ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఈ‌పి‌ఎఫ్ పోర్టల్‌కు లాగిన్ చేయండి.
2.మేనేజ్ సెక్షన్‌కి వెళ్లి ఈ-నామినేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. ప్రొఫైల్‌లో పర్మనెంట్ అండ్ టెంపరరీ అడ్రస్ ఎంటర్ చేసి 'సేవ్' బటన్‌పై క్లిక్ చేయండి. అలాగే మీరు కుటుంబ సభ్యులా కాదా అని కూడా ఎంచుకోండి.
4. కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, సంరక్షకుడు (మైనర్ నామినీ) వంటి వివరాలను ఎంటర్ చేసిన తరువాత కుటుంబ వివరాలను సేవ్ పై క్లిక్ చేయండి. ఒకవేళ కావాలనుకుంటే మరొకరిని కూడా నామినీలుగా జోడించవచ్చు.

55

5. ఏ నామినీకి మొత్తం లభిస్తుందో కూడా మీరు ప్రకటించవచ్చు.
6. ఆధార్ వర్చువల్ ఐడిని ఎంటర్ చేసి 'వెరిఫై'పై క్లిక్ చేయండి.
7. ఆధార్ నంబర్ లేదా ఆధార్ వర్చువల్ ఐ‌డిని ఎంటర్  చేశాక  'గెట్ ఓ‌టి‌పి'పై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓ‌టి‌పి వస్తుంది.
8. ఈ‌పి‌ఎఫ్‌ఓలో నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడానికి ఓ‌టి‌పిని ఎంటర్ చేయండి. దీని తర్వాత  ఫిజికల్ డాక్యుమెంట్స్ అందించాల్సిన అవసరం ఉండదు.

click me!

Recommended Stories