గ్రామాల్లో పురుషులు పనులకు, ఉద్యోగాలకు సమీపంలోని పట్టణాలు, నగరాలకు వెళ్లిపోతారు. చాలా మంది మహిళలు ఇంటి పనుల కోసం ఇళ్లలోొనే ఉండిపోతారు. అలాంటి వారు తమ ఇంటి పనులన్నీ అయిపోయాక ఖాళీగా ఉన్న సమయంలో పనిచేసుకొని డబ్బులు సంపాదించేలా భారతీయ జీవిత బీమా ఒక చక్కటి ఉపాధి అవకాశాన్ని తెచ్చింది. అదే బీమా సఖి LIC ఏజెంట్లు. మీరు గాని మీ గ్రామంలో బీమా సఖిగా చేరితే నెలకు రూ.7 వేల వరకు సంపాదించవచ్చు.
బీమా సఖి విధులేమిటి?
భారతీయ జీవిత బీమా సంస్థ అన్ని వర్గాల వారికి పాలసీలు ఇస్తుంది. బీమా సఖిగా చేరిన మహిళలు ఏం చేయాలంటే బీమా గురించి ఊర్లో అవగాహన కల్పించాలి. ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయాలి. ఎంత పాలసీ కడితే ఎంత ఆదాయం వస్తుంది. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఎల్ఐసీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు వివరిస్తూ పాలసీలు చేయించాలి.
పాలసీలు చేయించడం ద్వారా కమీషన్
బీమా సఖి LIC ఏజెంట్లు పాలసీ చేయించడం ద్వారా కమిషన్ సంపాదించవచ్చు. ఈ కమీషన్ తో పాటు మొదటి మూడు సంవత్సరాలు జీతం డబ్బులు కూడా ఇస్తారు. మొదటి సంవత్సరం నెలకు రూ.7,000 ఇస్తారు. రెండో సంవత్సరం రూ.6,000 ఇస్తారు. మూడో సంవత్సరం రూ.5,000 ఇస్తారు. ఇవి కాకుండా పాలసీలపై కమీషన్ సంపాదించవచ్చు.
ఏ సమయంలోనైనా పనిచేసుకోవచ్చు
బీమా సఖులు ఏ టైమ్ లోనైనా పనిచేసుకోవచ్చు. దీనికోసం ఎల్ఐసీ వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు ఆడవాళ్లు బీమా సఖిగా చేరడానికి అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి పాసై ఉండాలి. ఊర్లో ఉండే ఆడవాళ్లకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. మీరు ఆన్‌లైన్‌లో కూడా బీమా సఖి ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. LIC వెబ్‌సైట్‌లో ఫారం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లై చేయండి.
ఇది కూడా చదవండి నెట్‌ఫ్లిక్స్‌లో మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినిమాలు, వీడియోలే ఎలా వస్తున్నాయో తెలుసా?