car insurance: ఇన్సూరెన్స్ లేకుండా కారు నడిపితే అన్ని సంవత్సరాలు జైలులో ఉండాలా? రూల్స్ ఇంత కఠినంగా ఉన్నాయేంటి?

Published : Jul 02, 2025, 06:03 PM IST

car insurance: కారు నడపాలంటే కేవలం లైసెన్స్ ఉంటే సరిపోదు. పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఇలా కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. వాటిల్లో ఏది లేకపోయినా పోలీసులు మీకు ఫైన్ వేస్తారు. అయితే ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత కాలం జైలు శిక్ష వేస్తారో మీకు తెలుసా? 

PREV
15
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి

భారతదేశంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వాహనానికి బీమా పాలసీ కలిగి ఉండాలి. ఇది 1988లో అమలులోకి వచ్చిన మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Act, 1988) ప్రకారం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నిబంధన. ఈ చట్టం కింద ఎటువంటి మోటార్ వాహనానికైనా కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. దీనిని ఉల్లంఘించినట్లయితే జరిమానాలు, కోర్టు కేసులు, గరిష్ఠంగా జైలు శిక్ష కూడా విధించవచ్చు.

25
ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల మీరు ఏదైనా వాహనాన్ని ఢీకొడితే వారికి లేదా వారి వాహనాలకు ఏం జరిగినా ఆ బాధ్యతను ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. ఇది మీకు ఎంతో భరోసా ఇస్తుంది. మీ బాధ్యతను ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. ఇన్సూరెన్స్ మీకు రక్షణ కలిగించడమే కాకుండా, ఇది మీరు తీసుకుంటే చట్టబద్ధమైన నిబంధనలను కూడా పాటించవారవుతారు .

35
పోలీసులకు ఉన్న అధికారాలు

ట్రాఫిక్ పోలీసులకు ఎటువంటి వాహనాన్నైనా ఆపి, వాహన సంబంధిత పత్రాలు తనిఖీ చేసే అధికారం ఉంది. వాహనదారుడు సరైన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు చూపించలేకపోతే జరిమానాలు కూడా విధించే అధికారం ఉంటుంది. 

కోర్ట్ కేసులు ఎలా ఉంటాయి? 

నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులు ట్రాఫిక్ కోర్టుకు వెళుతాయి. అక్కడి తీర్పుపై ఆధారపడి జైలు శిక్ష లేదా అదనపు జరిమానా విధిస్తారు. 

45
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే శిక్షలు ఎలా ఉంటాయంటే..

చట్టం ప్రకారంవాహనదారుడు ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే మోటార్ వెహికల్ యాక్ట్, 1988 – సెక్షన్ 196 ప్రకారం మొదటి తప్పిదానికి రూ.2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. లేదా రెండూ కలిపి విధించవచ్చు. 

రెండో సారి పట్టుబడితే జరిమానా రూ.4,000 విధిస్తారు. జైలు శిక్ష పెరిగే అవకాశం ఉంటుంది.

55
డిజిటల్ డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుందా?

భారత ప్రభుత్వం అనుమతి పొందిన DigiLocker, mParivahan యాప్‌లలో వాహనపత్రాలు సురక్షితంగా స్టోర్ చేయవచ్చు. ట్రాఫిక్ పోలీసులు ఈ డిజిటల్ డాక్యుమెంట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తిస్తున్నారు. అయితే పత్రాలు అప్డేట్ అయ్యి ఉండాలి. కాలం చెల్లినవి ఉంటే జరిమానా తప్పదు. 

Read more Photos on
click me!

Recommended Stories