మీరు బంగారం కొనడానికి వెళ్లినప్పుడు, మీరు పాన్ కార్డ్ లేదా KYC డాక్యుమెంట్ అడగవవచ్చు. దేశంలోని కొన్ని లావాదేవీలకు పాన్ కార్డును చూపించడం తప్పనిసరి. దీని వల్ల నల్లధనం చలామణి నిరోధించవచ్చు.
2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కొనుగోలు చేస్తే పాన్ చూపించాలి. ఆదాయపు పన్ను నిబంధనలలోని సెక్షన్ 114B ప్రకారం దేశంలో ఈ నియమం ఉంది. జనవరి 1, 2016కి ముందు రూ.5 లక్షలకు మించి బంగారం కొనుగోలు చేస్తే పాన్ నంబర్‌ను చూపించాలనే నిబంధన ఉండేది.